ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండీ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఐఐటీ మండీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అసిస్టెంట్ ఇంజనీర్, ఫిజకల్ ట్రెయినింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్/ పీజీ డిప్లొమా/ ఎండీ/ ఎంఎస్, మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.
https://www.iitmandi.ac.in/administration/recruitment.php వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది. భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.