Rajya Sabha: రాజ్యసభ సభ్యుల కోసం సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఎంపికలో సామాజిక, ఆర్థిక సమీకరణలు బేరీజు వేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని మరీ ప్రాధాన్యాలను చూస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను గుర్తించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. సామాజిక అంశాల ఆధారంగానే వారికి సీట్లు కేటాయించేందుకు సంకల్పించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన మదిలో ఆ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి నలుగురికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఉండటంతో అందరి కన్ను వాటిపైనే పడింది. అధినేత ప్రసన్నం కోసం ప్రదక్షిణలు చేస్తన్నారు. తమకు సీటు కేటాయించాలని ప్రాధేయపడుతున్నారు.

బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్న సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ల కాలం పూర్తి కానుంది. దీంతో వీరి స్థానంలో నలుగురు ఎంపీలకు చోటు దక్కనుంది. దీని కోసం పైరవీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వారి స్థానాలు భర్తీ చేసేందుకు నలుగురి పేర్లు పరిశీలిస్తున్నారు. ఇందులో విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే. ఇక మూడు స్థానాల కోసం జగన్ పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. జాతీయస్థాయి ప్రయోజనాలను లెక్కలోకి తీసుకుంటూ పార్టీకి లాభాలు చేకూరేలా ఎంపిక ఉండాలని భావిస్తున్నారు. దీని కోసమే ఆయన స్వతహాగా కసరత్తు ప్రారంభించారు.
Also Read: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల జీతాలు ఎలా తగ్గుతాయి..? ఆ వివరాలేంటి..?
ఇందులో నెల్లూరు జిల్లా నుంచి ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తానరావు పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఈయనతో పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన అభ్యర్థిత్వంపై సందేహాలు తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో నాయకుడి ఎంపికలో కూడా జగన్ తలమునకలైనట్లు సమాచారం. దీనికి గుంటూరుకు చెందిన ఓ బడా నేతకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజ్యసభ సభ్యుల ఎంపికలో జగన్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక నాలుగో సీటు కోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సూచించిన వ్యక్తికి దక్కనున్నట్లు ప్రచారం సాగుతోంది.
రాబోయే ఎన్నికలను లెక్కలోకి తీసుకుని సామాజిక సమీకరణల నేపథ్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పార్టీకి సేవలందించిన వారి సేవలు వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ ను నమ్ముకున్న వారికి న్యాయంచేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన మదిలో ఉన్న పేర్లు మాత్రం బయటకు రావడం లేదు. ఏకంగా నామినేషన్ వేసే సమయంలోనే ప్రకటించి వారిని పోటీకి దింపేందుకు సమయాత్తమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో జగన్ ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: చంద్రబాబులో నిజంగా మార్పు వచ్చినట్లేనా?
[…] […]