Homeజాతీయ వార్తలుదుబ్బాక బరిలో ఆ కలెక్టర్? కేసీఆర్ ఫిక్స్ చేశారా?

దుబ్బాక బరిలో ఆ కలెక్టర్? కేసీఆర్ ఫిక్స్ చేశారా?

dubbaka
ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ ది అందెవేసిన చేయి. ప్రత్యర్థులు కూడా ఊహించని స్టెప్పులు వేస్తుంటారు టీఆర్ఎస్ అధినేత. అలాంటి నేత ఇప్పుడు దుబ్బాకలో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది.  తాజాగా టీఆర్ఎస్ తరుఫున దుబ్బాక బరిలో మరో పేరు తెరపైకి వస్తోంది. దుబ్బాకతోపాటు  జిల్లాలో మంచి పేరు తెచ్చుకున్న  ఐఎఎస్ అధికారి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కేసిఆర్ దుబ్బాక అసెంబ్లీకి పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. కలెక్టర్ కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, గతంలో హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ టికెట్ కోసం కూడా ప్రయత్నించారని చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో స్కూళ్లు తెరుచుకునేది అప్పుడే..

గతంలో చాలాసార్లు, కేసిఆర్ స్వయంగా ఈ ఐఏఎస్ అధికారిని టిఆర్ఎస్ లో చేరమని ఆహ్వానించారు. వెంకట్రామిరెడ్డిని నిజమైన ప్రజల ప్రతినిధిగా కెసిఆర్ పిలిచిన సందర్భాలు ఉన్నాయి.ఆయన ఎప్పుడూ ప్రజలతో కలిసిపోయి ఉత్తమ సేవలందించారు. కాబట్టి వెంకటరామిరెడ్డి ఎన్నికల యుద్ధంలోకి ప్రవేశిస్తే, అది దుబ్బాకలో ఆసక్తికరమైన యుద్ధంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

నవంబర్‌లో జరిగే దుబ్బాక అసెంబ్లీ  ఉప ఎన్నికకు తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం మొదట మరణించిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను నిలబెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉప ఎన్నికల్లో సోలిపేట మరణంతో వచ్చిన సానుభూతిని క్యాష్ చేసుకోవాలని టిఆర్ఎస్ ఆశించింది. కానీ ఇప్పుడు తాజా సర్వే వారి ఫ్యామిలీని దింపితే ఓటమి తథ్యం అని తేలిదంట.. దీంతో అది  సురక్షితమైన స్టెప్ కాదని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది.

Also Read: ‘అటల్ టన్నెల్’ తో దేశానికి ఏం ఉపయోగం?

టీఆర్ఎస్ దుబ్బాక నియోజకవర్గంలో సర్వే నిర్వహించినట్టు తెలిసింది. ఆ సర్వేలో టీఆర్ఎస్ కు పెద్దగా పాజిటివ్ వేవ్స్ లేవని తేల్చినట్టు ప్రచారం సాగుతోంది.  మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రజలలో  టిఆర్ఎస్ పట్ల కోపం ఉందని.. అది ప్రతికూలమయ్యే చాన్స్ ఉందని తేలిందట.. పైగా సోలిపేట కుటుంబానికి కూడా ఓటర్లలో పెద్దగా సానుభూతి లేదని సర్వేలో వెల్లడైనట్టు ప్రచారం సాగుతోంది. సోలిపేట జీవించి ఉన్నప్పుడు, గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీలో వారి కుటుంబాన్ని, బంధువులను ప్రోత్సహించారనే విమర్శలున్నాయి. దీంతో టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోలిపేట  పార్టీ టికెట్ ఆయన భార్యకు ఇవ్వడంపై పునరాలోచన చేస్తున్నట్టు తెలిసింది. సిద్దిపేట కలెక్టర్ నే దుబ్బాక బరిలో దించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇది నిజమా? కాదా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version