Homeజాతీయ వార్తలుVijay background and biography: విజయ్ కులం గురించి గూగుల్ ను అడిగింది చాలు గాని.....

Vijay background and biography: విజయ్ కులం గురించి గూగుల్ ను అడిగింది చాలు గాని.. ఇదిగో అతడి నేపథ్యం..

Vijay background and biography: ఎవరైనా గొప్ప స్థానాలు సాధిస్తే చాలు.. మన భారతీయులలో ఒకరకమైన భావన కలుగుతుంది. అది అంతటితోనే ఆగిపోదు. మన చేతి వేళ్ళు సుతారంగా గూగుల్ తల్లిని వెతికేస్తూ ఉంటాయి. పలానా వ్యక్తి కులం ఏంటి.. ఆయన నేపథ్యమేంటి.. ఎక్కడ పుట్టాడు.. ఏం చేస్తుంటాడని శోధిస్తూనే ఉంటాం.

మన భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలలో జాతులు.. మరి కొన్ని రాష్ట్రాలలో కులాలు ఏలేస్తూ ఉన్నాయి. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ మనలో ఆ జాడ్యం పోలేదు. ఇకపై పోతుందనే నమ్మకం లేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కులాల కుంపట్లు.. మతాల సిగపట్లు.. జాతుల అగ చాట్లు కనిపిస్తూనే ఉంటాయి. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి అది ఎక్కువగా కనిపించింది. కాకపోతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినప్పటికీ.. తొలి ఎన్నికల్లోనే ఆయన తమిళనాడు రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించారు.. విజయ్ ముఖ్యమంత్రి కావడం లాంచనమే. ఆయన తమిళనాడు గవర్నర్ కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీట్ల పరంగా అతిపెద్ద పార్టీ ఆవిర్భవించిన వారికే ముఖ్యమంత్రి స్థానం లభిస్తుంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార చేయబోతున్న నేపథ్యంలో గూగుల్లో ఒక అంశం విపరీతంగా సెర్చ్ అయింది. అదేంటంటే విజయ్ కులం ఏంటి.. విజయ్ ఇప్పటికే తన కులాన్ని తమిళం అని చెప్పేశారు. ఆయన తండ్రి కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. అయినప్పటికీ మనవాళ్లు ఊరుకోరు కదా.. విజయ్ ని కొంతమంది మావాడు అంటే.. మరి కొంతమంది మావాడు అంటూ ఓన్ చేసుకుంటున్నారు.. ఇక్కడ విజయ్ కులం అందరూ అనుకున్నట్టుగా అది కాదు. విజయ్ వెల్లాలార్ కులానికి చెందినవారు.

ఈ కులం వారు మనదేశంలో తమిళనాడు, కేరళ, శ్రీలంక దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ కులానికి చెందినవారు భూస్వాములుగా ఉంటారు. వీరంతా కూడా వ్యవసాయాన్ని చేస్తుంటారు. వీరి భాషలో వ్యవసాయాన్ని వేలన్మై అని పిలుస్తారు. వెల్ల లార్ అనే పదానికి అర్థం వెల్ అంటే ఈటే అని.. అలర్ అంటే సాగుదారుడు అని.. అర్థం.

ఈ కులానికి చెందినవారు భూస్వాములు.. సాగుదారులుగా ఉన్నారు. పురాతన కాలం నుంచి తమిళనాడులో వీరు ఆధిపత్య వర్గంగా కొనసాగుతున్నారు. చోళులు, పాండ్యులు, పల్లవుల పరిపాలన కాలంలో వెల్లలార్ కులానికి చెందినవారు యోధులుగా, పరిపాలన అధికారులుగా ఉన్నారు. కోటల నిర్వాహకులు కూడా వ్యవహరించారు.. వెల్లలార్ కులంలో అనేక ఉప కులాలు ఉన్నాయి.. కొంగు వెల్లలార్, తులువ వెల్లలార్, చోలియా వెల్లలార్, కర్కటార్ వెల్లలార్, దేవేంద్ర వెల్లలార్ ముఖ్యమైన ఉపకులాలు..

ఈ కులంలో పుట్టిన వారు తమ పేర్ల చివర లేదా మొదలియార్ లేదా గౌండర్ అనే బిరుదులు పెట్టుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలో వీరు దాదాపు 33 శాతం వరకు ఉన్నారు.. కేవలం రాజకీయాల్లోనే కాకుండా.. సామాజికంగా.. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version