Basara IIIT: బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాలయంలోని ఐదు వేల మంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అల్పాహారం మానేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
రెగ్యులర్ వైస్ ఛాన్స్ లర్ ను నియమించాలని.. పర్మనెంట్ ఉద్యోగులు లేకపోవడం.. ల్యాప్ టాప్, యూనిఫామ్స్ అందించాలని తాగునీటితో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆహారం చాలా దరిద్రంగా ఉంటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యమైన ఏవీ యూనివర్సిటీలో లేవని.. నాసిరకం ఇస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 7500 మంది విద్యార్థులకు కేవలం 17మంది మాత్రమే పర్మినెంట్ స్టాఫ్ ఉన్నాడు. దీంతో వారిని పట్టించుకునే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు సిగ్నల్ లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు నడవడం లేదు. విద్యార్థులకు కంప్యూటర్ లేదు. యూనివర్సిటీలో సమస్యలు బయటకు పొక్కకుండా నెట్ ను ఆపుచేశారు. మీడియాను అనుమతించడంతో విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి చూసి వెళ్లడం తప్ప న్యాయం చేసిన దాఖలాలు లేవు.
బిఎస్ పి ఇతర పార్టీల మద్దతు ప్రకటించి ఆందోళనకు మద్దతు తెలిపాయి.. యూనివర్సిటీ లో పోలీసుల మోహరించారు. మీడియాకు నో ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు.