https://oktelugu.com/

CM KCR: కేసీఆర్ లో టెన్ష‌న్ మొద‌లైందా.. ప‌ర్‌ఫెక్ట్ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారా..?

CM KCR: కేసీఆర్ అంటే రాజ‌కీయ చాణక్యుడు. ఏ ప‌ని చేయాల‌నుకున్నా స‌రే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. తాను అకున్న ప‌ని చుట్టూ చేయాల్సిందంతా చేసి స‌మ‌యం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టేస్తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే రీసెంట్ గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కుంభ స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం అనే డైలాగ్ అన్న‌మాట‌. ఇలా తాను అనుకున్న‌ది అంత ప‌ర్‌ఫెక్ట్ గా చేస్తుంటారాయ‌న‌. కానీ ఈ మ‌ధ్య కేసీఆర్ లో ఎందుకో గంద‌ర‌గోళం […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 31, 2022 1:37 pm
    KCR To Visit Medaram Jatara

    KCR To Visit Medaram Jatara

    Follow us on

    CM KCR: కేసీఆర్ అంటే రాజ‌కీయ చాణక్యుడు. ఏ ప‌ని చేయాల‌నుకున్నా స‌రే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు. తాను అకున్న ప‌ని చుట్టూ చేయాల్సిందంతా చేసి స‌మ‌యం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టేస్తారు. ఒక ర‌కంగా చెప్పాలంటే రీసెంట్ గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కుంభ స్థ‌లాన్ని బ‌ద్ద‌లు కొట్ట‌డం అనే డైలాగ్ అన్న‌మాట‌. ఇలా తాను అనుకున్న‌ది అంత ప‌ర్‌ఫెక్ట్ గా చేస్తుంటారాయ‌న‌.

    KCR Shocks To Opposition Party's

    CM KCR

    కానీ ఈ మ‌ధ్య కేసీఆర్ లో ఎందుకో గంద‌ర‌గోళం క‌నిపిస్తోంది. ఏదో చేయ‌బోతో ఇంకేదో జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా కేంద్రంతో విబేధాలు వ‌చ్చిన త‌ర్వాత అనుకున్న ప‌ని ఒక్క‌టి కూడా స‌రిగ్గా జ‌ర‌గ‌ట్లేదు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఈ రోజు జ‌ర‌గిన ప‌రిణామం. ఈ రోజు స‌డెన్ గా కేసీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఉద‌యం 10.30గంట‌ల‌కు ప్రత్యేక విమానంలో వెళ్తారని చెప్పారు.

    Also Read: Bandi Sanjay: పోలీస్ వ్య‌వ‌స్థ‌పై సంజ‌య్ ఒత్తిడి.. ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు..

    కానీ కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్ల‌లేదు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ లోనే ఆగిపోయారు. అస‌లు కేసీఆర్ ఇంత స‌డెన్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్లాల‌నుకున్నారు.. మ‌రి స‌డెన్ గా ఎందుకు ఆగిపోయారు అంటే ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి కొన్ని కాక‌మ్మ క‌థ‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న పంటి నొప్పి కోసం ఢిల్లీకి వెళ్తున్నార‌ని అంటున్నారు. కేసీఆర్ ఎప్ప‌టి నుంచో ఢిల్లీలోని ఓ పంటి వైద్యుడి ద‌గ్గ‌ర చికిత్స తీసుకుంటున్నారు.

    ఆయ‌న వ‌ద్ద‌కే మ‌రోసారి వెళ్తున్నార‌ని అంటున్నారు. కానీ ఇది అస‌లు కార‌ణం కాదు. కేసీఆర్ చాలా రోజులుగా ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నారు. ఆయ‌న‌తో భేటీ అయి కొన్ని ముఖ్య‌మైన విషయాల‌మీద చ‌ర్చించాల‌ని అనుకుంటున్నారు. కానీ కుద‌ర‌ట్లేదు. పైగా గురువు చిన‌జీయ‌ర్ కూడా దూర‌మ‌య్యారు.

    కేంద్రంపై ఒంటికాలితో లేస్తుండ‌టంతో మోడీ కూడా కేసీఆర్‌ను క‌ల‌వ‌డానికి ఇంట్రెస్ట్ చూప‌ట్లేదంట‌. మొన్న తెలంగాణ‌లో స‌మ‌తామూర్తి వేడుక ప్రారంభోత్స‌వానికి మోడీ వ‌స్తే కేసీఆర్ అటువైపు కూడా వెళ్ల‌కుండా అవ‌మానించార‌ని బీజేపీ పెద్ద‌లు సీరియ‌స్ గా ఉన్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్‌కు అపాయింట్ మెంట్ ఇవ్వ‌ట్లేదంట‌. కేసీఆర్ మాత్రం సీరియ‌స్ గా ట్రై చేస్తున్నారు.

    CM KCR

    CM KCR

    ప్ర‌ధాని అపాయింట్ దొరికే అవ‌కాశం ఉంద‌నే సంకేతాలు రాగానే కేసీఆర్ ప్రత్యేక విమానాన్ని లైన్ లో పెట్టారు. దొరికితే మోడీ వ‌ద్ద‌కు నేరుగా వెళ్లిపోవాల‌ని అనుకుంటున్నారు. లేదంటే పంటినొప్పి క‌థ‌ను సిద్ధం చేసుకుని ఉంచారు. కానీ మ‌రో రెండు రోజుల దాకా అపాయింట్ మెంట్ ఇచ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. దీంతో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు.

    కేసీఆర్‌లో ఇప్పుడు చాలా గంద‌ర‌గోళం అయితే క‌నిపిస్తోంది. ఏం చేయాలో, ఏది చేయాలో క్లారిటీ లేదు. ఒక‌ప్ప‌టి లాగే ప‌ర్‌ఫెక్ట్ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారు. ఇదే ఇప్పుడు టీఆర్ ఎస్‌ను టెన్ష‌న్ పెడుతోంది. చూడాలి మ‌రి కేసీఆర్ ఏం చేస్తారో.

    Also Read: AP Cabinet Expansion: జగన్ కొత్త కేబినెట్ లో ఎవరెవరు ఉంటారు?

    Tags