Megastar Chiranjeevi: సినిమా రంగంలో రాణించాలంటే సక్సెస్ రేటు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా హీరోయిన్లకు సక్సెస్ ఉంటేనే ఛాన్సులు వస్తాయి. హీరోలకు సక్సెస్ రేటు తక్కువగా ఉన్నాసరే వారికి ప్రత్యేక అభిమానులు ఉంటారు కాబట్టి.. ఆటోమేటిక్ గా ఒకే టైంలో మూడు నాలుగు సినిమాలు చేస్తుంటారు. అయితే ఒకప్పటి హీరోయిన్లు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు స్టార్ హీరోల పక్కన హీరోయిన్లుగా చేసి.. ఆ తర్వాత అవకాశాలు రాక సెకండ్ ఇన్నింగ్స్ లో అదే హీరోకు తల్లిగా కూడా నటించే వారు. ఇలా చిరంజీవి పక్కన హీరోయిన్లుగా ఆ తర్వాత తల్లిగా నటించిన ఇద్దరు హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఈ ఇద్దరూ ఎవరో కాదండోయ్.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు జయసుధ, సుజాత. 1979లో కె.బాలచందర్ డైరెక్షన్ లో చిరంజీవి ఇది కథ కాదు అనే సినిమా చేశారు. ఇందులో హీరోయిన్ గా జయసుధ నటించింది. ఆ తర్వాత 1986లో విజయబాపినీడు డైరెక్షన్ లో రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా చిరంజీవి మగధీరుడు అనే సినిమాను చేశారు. ఇందులో కూడా జయసుధ హీరోయిన్ గా నటించింది. విచిత్రమేంటంటే ఈ సినిమా వచ్చిన తొమ్మిదేళ్లకి 1995లో కోడి రామకృష్ణ డైరెక్షన్ లో చిరంజీవి చేసిన రిక్షావోడు సినిమాలో ఆయనకు తల్లిగా జయసుధ నటించింది.
Also Read: Anchors Turns Heroines: యాంకర్స్ నుంచి హీరోయిన్లుగా మారింది వీళ్లే !
మరో స్టార్ హీరోయిన్ సుజాత 1980లో చిట్టిబాబు డైరెక్షన్ లో చిరంజీవి చేసిన ప్రేమ తరంగాలు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 1982లో ఈరంకి శర్మ డైరెక్షన్ లో వచ్చిన సీతాదేవి మూవీలో కూడా ఆమెనే హీరోయిన్ గా చిరంజీవి పక్కన నటించి మెప్పించింది. అయితే 1995లో విజయబాపినీడు డైరెక్షన్ లో చిరంజీవి చేసిన బిగ్ బాస్ మూవీలో ఆయనకు తల్లిగా సుజాత నటించింది.
విచిత్రమేంటంటే ఈ ఇద్దరు హీరోయిన్లు చిరంజీవి తల్లిగా నటించిన సినిమాలకు విజయ బాపినీడు డైరెక్టర్. దాంతోపాటు ఈ రెండు సినిమాలు కూడా 1995 లోనే రిలీజ్ అయ్యాయి. మరో విషయం ఏంటంటే 1980లో ప్రేమ తరంగాలు సినిమాలో జయసుధ, సుజాత కలిసి నటించారు. ఇప్పటికి కూడా జయసుధ తల్లి పాత్రలో, నానమ్మ పాత్రలో నటిస్తూనే ఉంది. కానీ సుజాత కొంతకాలం తల్లి పాత్రల్లో నటించి.. ఆ తర్వాత మాత్రం నటనకు దూరమైంది.