KCR: తెలంగాణలో అప్పుడు ఎన్నికల కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రెడీ అయిపోతున్నాయి. ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు వచ్చే ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జెండా ఎగరేయాలని బీజేపీ గ్రౌండ్ లెవల్లో కష్టపడుతోంది. ఇక కాంగ్రెస్ కూడా పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని చూస్తోంది.
కాగా మిగతా పార్టీల కంటే వచ్చే ఎన్నికల కోసం కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి భారీ వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం బీజేపీ మీదే ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. ఇందులో రీసెంట్ గా జరిగిన పార్టీ ప్లీనరీ మీటింగ్‌లో చాలా మంది ఎమ్మెల్యేలకు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇంకొందరికి సీరియస్ హెచ్చరికలు కూడా చేశారంట.
దీంతో గతంలో లాగే ఈ సారి కూడా తమ మీద కేసీఆర్ సర్వేలు చేయించారేమో అని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారంట. ఇప్పటి వరకు చాలా సార్లు కేసీఆర్ ఇలాగే సర్వేలు చేయించి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని తెలిస్తే వారిని ఎన్నికల్లో పక్కన పెట్టేశారు. ఇక కేసీఆర్ ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేయడాన్ని బట్టి చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో చాలామందిపై వేటు పడుతుందనే భావన వారిలో పెరిగింది.
Also Read: KCR: ముందస్తు ఎన్నికలకు వెళ్తే నష్టపోయేది కేసీఆరే..!
ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ బలపడేందుకు గ్రౌండ్ లెవల్లో కష్టపడుతోంది. టీఆర్ ఎస్ లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గంలో బీజేపీ బలపడే ఛాన్స్ ఉందని కేసీఆర్ ఆలోచిస్తున్నారంట. ఏ క్షణంలో అయినా కేసీఆర్ ముందస్తుకు పిలుపునిచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదును చూసి ముందుకు వెళ్లేలోపల ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగుపర్చుకోవడం చాలా ముఖ్యం అని ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్టు ఇచ్చాయంట.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో లేక్ వ్యూ క్యాంప్ ఆఫీసు ముస్తాబులో ఆంతర్యమేమిటో?