Canada wildfires: మంటలు.. ఎటు చూసినా మంటలు.. ఆ మంటలను మించిన పొగలు. వాటి ధాటికి ప్రజలు వణికి పోతున్నారు. అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. సుమారు పది కోట్ల మంది ఈ కార్చిచ్చు వల్ల నరకం చూస్తున్నారు.. ఈ మంటలు అదుపు చేసేందుకు కెనడా ప్రభుత్వం, అటు అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. అయితే దీనంతటికీ కారణం కెనడా తూర్పు ప్రాంతంలో చెలరేగిన దావానలం. గురువారం తెల్లవారుజామున నాటికి మొత్తం ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా ఉన్నాయని తెలుస్తోంది. అందులో 150 క్యూబెక్ ప్రావిన్స్ లో ఉన్నాయి. ఇక దేశ చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన కార్చిచ్చు అని కెనడా ప్రధాని ప్రకటించాడు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
3.8 మిలియన్ హెక్టార్లలో..
ఈ మంటలు ధాటికి 3.8 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఇది అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్ర విస్తీర్ణానికి దాదాపు రెట్టింపు. ఈ పొగ కెనడా దేశం నుంచి వందల మైళ్ల దూరం పాకింది. పశ్చిమాన ఉన్న చికాకు నుంచి దక్షిణాన ఉన్న అట్లాంటా వరకు వ్యాపించింది. 20,000 మంది వరకు తమ ప్రాంతాల నుంచి తరలిపోయారు. ఒక్క అమెరికాలోనే 7.5 కోట్ల మంది ప్రభావితమయ్యారు..
ఆరు నెలల క్రితం
కెనడాలోని 13 ప్రావీన్సులలో దాదాపు 6 వారాల కిందట మొదలైంది ఈ దావానలం. అడవిలో అనూహ్య సంఘర్షణ, అర్పకుండా పడేసిన సిగరెట్ పీకలు, రైళ్ల రాకపోకల సందర్భంగా వచ్చే నిప్పురవ్వలే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిజానికి వాతావరణ మార్పులు, తాతత హరిత అరణ్యాలు ఉండే పశ్చిమ కెనడాలో వేసవిలో కార్చిచ్చు రేగుతుంది. దీనివల్ల తూర్పు రాష్ట్రాలకు పెద్దగా ముప్పు ఉండదు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వీచే గాలి ఈ ప్రాంతాన్ని తేమగా, చల్లగా ఉంచడమే దీనికి కారణం. కానీ, ఈ వేసవిలో పరిస్థితులు మారాయి. తీవ్రవాయు కాలుష్యం సహజంగా నీలిరంగు తో నిర్మలంగా ఉంటుంది న్యూయార్క్ గగనతలం. వాయు కాలుష్య ప్రభావిత నగరంలో దాని స్థానం మొదటి మూడు స్థానాల్లో ఉంటుంది. కానీ, కెనడా దావానలం ప్రభావంతో న్యూయార్క్ గగనతలాన్ని కమ్మేసింది. మన్ హట్టన్ ఆకాశ హర్మ్యా లపై చిక్కటి పసుపు రంగులో పరుచుకుంది. గురువారం అక్కడ వాయు నాణ్యత సూచి ( ఏ క్యూ ఐ) 413 గా నమోదయింది. ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య నగరంగా నిలిచింది. స్కేల్ పై ఏ క్యూ ఐ 500 అయితే.. న్యూయార్క్ లో 400 దాటింది అంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపించలేదు అంటే అక్కడి కాలుష్య తీవ్రతను ఊహించుకోవచ్చు. 1960 తర్వాత ఇలా ఎన్నడూ లేదని అక్కడి అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అత్యవసర సంక్షోభమని వారు అభివర్ణిస్తున్నారు. కొద్దిరోజులు ఇలాగే ఉంటుందని, ఎవరూ ఇళ్ళు విడిచి రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు. ఇక ఈ ప్రభావంతో న్యూయార్క్ కు భారీగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అమెరికా ఉక్కిరి బిక్కిరి
కెనడాలోని నోవా స్కోటియాకు ఎగువన అల్పపీడనం అపసవ్య దిశలో తిరుగుతూ దక్షిణానికి వీచేలా గాలులను సృష్టించింది. దీంతో పొగ అలుముకుని న్యూయార్క్, బోస్టన్, పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ, పరిసర ప్రాంతాలకు వ్యాపించింది..ఒహియో నగరం కూడా ప్రమాదం అంచులో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మియాన్నె, మిన్నె సోటా, దక్షిణ కరోలినా, ఉత్తర కరోలినా రాష్ట్రాల్లోనూ గాలి నాణ్యత భారీగా క్షీణించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా తూర్పు తీరం, పశ్చిమ మధ్య ప్రాంతాల దాకా వ్యాపించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ లోనూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కెనడాలో ఐదవ నెంబర్ సన్నద్ధత సూచిక జారీ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బృందాలు మంటలను అదుపు చేయడంలో సహాయపడుతున్నాయి.