https://oktelugu.com/

TDP Twitter Account Hacked: టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులతో షాకిచ్చిన హ్యాకర్లు

TDP Twitter Account Hacked: మీడియా అయినా.. సోషల్ మీడియా అయినా ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో టీడీపీది అందెవేసిన చేయి. అలాంటి చేయి విరిచేలా హ్యాకర్లు విరుచుకుపడ్డారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అసభ్యమైన పార్టీ పరువు తీసేలా పోస్టులు పెట్టారు. ఇది తెలియని తెలుగు తమ్ముళ్లు ఆపోస్టులు చూసి అవాక్కయ్యారు. ఏం జరిగిందని ఆరాతీసే లోపే నారా లోకేష్ ఈ కబురును అందరికీ విడమరిచి చెప్పారు. సోషల్ మీడియాలో తామే తోపులం అంటూ రెచ్చిపోయే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 / 11:40 AM IST
    Follow us on

    TDP Twitter Account Hacked: మీడియా అయినా.. సోషల్ మీడియా అయినా ప్రత్యర్థులను చెడుగుడు ఆడడంలో టీడీపీది అందెవేసిన చేయి. అలాంటి చేయి విరిచేలా హ్యాకర్లు విరుచుకుపడ్డారు. టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అసభ్యమైన పార్టీ పరువు తీసేలా పోస్టులు పెట్టారు. ఇది తెలియని తెలుగు తమ్ముళ్లు ఆపోస్టులు చూసి అవాక్కయ్యారు. ఏం జరిగిందని ఆరాతీసే లోపే నారా లోకేష్ ఈ కబురును అందరికీ విడమరిచి చెప్పారు.

    Telugu Desam Party

    సోషల్ మీడియాలో తామే తోపులం అంటూ రెచ్చిపోయే టీడీపీ బ్యాచ్ కు ఇది నిజంగా షాకింగ్ పరిణామమే. ఎందుకంటే వారి సోషల్ మీడియా ఖాతాలను తాజాగా హ్యాకర్లు హ్యాక్ చేసి పారేశారు. అక్కడితో ఆగకుండా టీడీపీ ఖాతాపై విచిత్రమైన పోస్టులు పెడుతూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇదిప్పుడు టీడీపీని కలవరపెడుతోంది.

    Also Read: Allu Arjun: అల్లు అర్జున్ స్టైలే వేరు.. అప్పుడు బాడీగార్డ్.. ఇప్పుడు డిజిటల్ హెడ్

    తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లుగా పార్టీ నేతలు గుర్తించారు. ఈ మేరకు జరుగుతున్న పరిణామాలపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసి వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో హ్యాకర్లు విచిత్రమైన పోస్టులు పెడుతూ టీడీపీ పరువు తీస్తున్నారు.

    దీంతో లోకేష్ ఆ పోస్టులను పట్టించుకోవద్దని.. ట్విట్టర్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యిందని.. పార్టీ సభ్యులంతా ఆ పోస్టులను పట్టించుకోవద్దని నారా లోకేష్ సూచించారు. ట్విట్టర్ ఖాతాను పునరుద్దరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    టీడీపీ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు అసభ్యమైన మెసేజ్ లు పంపినట్టు గుర్తించారు. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ సెల్ పేర్కొంది. ఇదంతా వైసీపీ సానుభూతి పరులు విదేశాల్లో ఉండి చేసిన కుట్రగా తెలుగుదేశం పార్టీ అనుమానిస్తోంది.

    Also Read: Mohan Babu Birthday Special Story: మోహన్ బాబు బర్త్ డే స్పెషల్: నటనలో ఆల్ రౌండర్.. వివాదాల వీరుడు

    ఇక టీడీపీ ఖాతాను హ్యాక్ చేసిన వారు స్పెస్ ఎక్స్ ఫొటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. దాని ఓనర్ ఎలన్ మస్క్ ను పొగుడుతూ పోస్టులు పెట్టారు.