Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu- Telangana: టీడీపీ ఘర్‌ వాపసీ సాధ్యమేనా? తెలంగాణలో చంద్రబాబు మంత్రం ఫలిస్తుందా? 

Chandrababu- Telangana: టీడీపీ ఘర్‌ వాపసీ సాధ్యమేనా? తెలంగాణలో చంద్రబాబు మంత్రం ఫలిస్తుందా? 

Chandrababu- Telangana: స్వకార్యం.. స్వామికార్యం రెండూ.. నెరవేరేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకుడు కొత్త మంత్రం వేశారు. బీజేపీతో దోస్తీ కోసం ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు ‘అపకారికి ఉపకారం’ అన్న చందంగా ఏపీలో తన ఓటమికి కారణమైన బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో ఉపకారం చేయాలని చూస్తున్నారు. తద్వారా ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో సాయం కోరుతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈ సమయంలో తన క్యాడర్‌ సపోర్టు ఇప్పించి ఉడతాభక్తి చాటుకునే ఆలలోచన బాబుకు వచ్చింది. ఈ ఉడతా భక్తి సాయానికి.. ఏపీలోనూ తాను అధికారంలోకి రావడానికి బీజేపీ ఉడతా భక్తిసాయం ఆశిస్తున్నారు చంద్రబాబు.

Chandrababu- Telangana
Chandrababu

ఘర్‌ వాపసీ పాలసీ..
బీజేపీతో దోస్తీ కోసం తెలంగాణలో ఇన్నాళ్లూ స్తబ్ధుగా ఉన్న టీడీపీ క్యాడర్‌ను ఉత్సాహపరిచే చర్యలు చేపట్టారు చంద్రబాబు.
తెలంగాణలో పార్టీ పుంజుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఖమ్మంలో పర్యటించారు. భారీ సభ నిర్వహించారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ అభిమానులు కూడా తరలివచ్చారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు వస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీని క్రియాశీలకంగా చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అంతేకాదు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉందని సంచలన వ్యాఖ్య చేశారు. ఇదే సమయంలో ఆయన ఘర్‌ వాపసీ పాలసీ ప్రకటించారు. పార్టీ నుంచి వివిధ పార్టీల్లోకి వెళ్లిన నేతలంతా తిరిగి టీడీపీలోకికి రావాఆలని పిలుపునిచ్చారు. గతంలో అనేక మంది నాయకులు టీడీపీ తరఫున గెలిచారని.. అయితే వివిధ కారణాలతో వేరే పార్టీలోకి వెళ్లారని చెప్పారు. ఎందుకు వెళ్లారు.. అని తాను అడగబోనని చెప్పిన చంద్రబాబు పార్టీ అవసరం అనుకునే నేతలంతా తిరిగి రావాలని కోరాడం చర్చకు దారితీసింది. కాసాని జ్ఞానేశ్వర్‌ వంటి నేతలను తయారుచేసి తెలంగాణలో టీడీపీని పునర్నిర్మించి.. పూర్వ వైభవం తీసుకొద్దామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.

వాపస్‌ వచ్చేదెవరు?
రాబోయే రోజుల్లో టీడీపీని తిరుగులేని పార్టీగా తయారు చేద్దామన్న చంద్రబాబు పిలుపుతో పార్టీని వీడిన వారు తిరిగి వస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఏ నాయకుడు అయినా.. పార్టీ మారారు అంటే.. వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమేననేది అందరికీ తెలిసిందే. ఈ రెండు అంశాలను ఫుల్‌ ఫిల్‌ చేసేలా టీడీపీ ఎదుగుతుందని అనుకున్నా.. వారిలో చంద్రబాబు నమ్మకం కలిగించినా.. చంద్రబాబు ప్రత్యేకంగా పిలుపునివ్వాల్సిన అవసరం లేదు. వారే వస్తారు. ఈ దిశగా పడాల్సిన పునాదులు చాలానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.

Chandrababu- Telangana
Chandrababu- Telangana

సరిహద్దు సభ సక్సెస్‌ అయినా..
ప్రస్తుతం చంద్రబాబు సభ పెట్టింది.. ఏపీ సరిహద్దు జిల్లాలో సో.. ఇది హిట్‌ అయింది. అదే ఆయన ఏ దుబ్బాకో.. సిరిసిల్లో మెదక్లోనో.. లేదా.. ఆదిలాబాద్‌లోనో సభ పెట్టి ఇదే తరహా హిట్‌ కొడితే.. కచ్చితంగా నాయకుల్లో నమ్మకం వస్తుందనేది పరిశీలకుల వాదన. మరి ఆదిశగా చంద్రబాబు అడుగులు వేస్తే.. ఆయన కోరకుండానే నేతలు క్యూ కట్టడం ఖాయం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version