Homeజాతీయ వార్తలుTelangana TRS Leaders Joins BJP: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు.. ఏం జరుగుతోంది?

Telangana TRS Leaders Joins BJP: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు.. ఏం జరుగుతోంది?

Telangana TRS Leaders Joins BJP: తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరాటం సాగుతోంది. దీంతో అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది. దీన్ని అడ్డుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించి బీజేపీని అధికారంలోకి రానీయకూడదని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో దూకుడు మీదుంది. టీఆర్ఎస్ ను రాష్ట్రంలో మట్టికరిపించి బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తోంది.

TRS Leaders Joins BJP
BJP and TRS

ఈ మేరకు పలువురు బీజేపీ వైపుచూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. భవిష్యత్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని భావించి ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ రేపు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ నివాసంలో ఉదయం భిక్షమయ్య కాషాయ కండువా కప్పుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.

Also Read: Indian Railways: ఈ తప్పులు చేయవద్దు.. రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సీనియర్ నేతలు కూడా హాజరు కానున్నారు. ఇంకా కొందరు నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత మంది బీజేపీలోకి క్యూ కట్టనున్నట్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలిసిపోతున్నందున అందరు కాషాయ పార్టీని గుర్తిస్తున్నట్లు పలువురి వాదన.

TRS Leaders Joins BJP
BJP TRS

భవిష్యత్ లో ఇంకా కొంతమంది బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రం తీసుకొస్తున్న పథకాలతో ఆకర్షితులై పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అందుకే బీజేపీలో చేరాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున నేతలు బీజేపీలో చేరి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు భంగపాటు తప్పదనే వాదనలు కూడా వస్తున్నాయి.

ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత ఏప్రిల్ 14 నుంచి ప్రారంభించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్ర ద్వారా టీఆర్ఎస్ విధానాలు ఎండగట్టేందుకు సిద్ధపడనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి టీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:Jagan Shocks MLA Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణకు షాక్ ఇచ్చిన జగన్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

2 COMMENTS

  1. […] Janasena BJP Alliance:  ఆయన మా బలమైన స్నేహితుడు..అని ఒక పార్టీ. వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదూ.. అటు నుంచి ప్రేమ ఉండాలి కదా అని మరో పార్టీ. వారి ట్రాప్ లో పడొద్దని ఇంకో పార్టీ… ఇది జనసేనాని పవన్ కల్యాణ్ విషయంలో రాష్ట్రంలో మిగతా పార్టీలు పడుతున్న ఆరాటం. అసలు పవన్ కు అంత సినిమా లేదని ఒకరు. రాజకీయ పరిణితి లేదని కొందరు. అన్న చిరంజీవి ప్రజారాజ్యంలా పార్టీ మూసుకోవాల్సిందేనని మరికొందరు. […]

  2. […] CM KCR: యాదాద్రి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు. చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. అయితే ఇప్పుడు కేసీఆర్‌ వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఇన్నేళ్లు వైష్ణవానికి ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్‌ ఇక నుంచి శైవం వైపు అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. శైవానికి ప్రసిద్ధిగాంచిన రాజన్న క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అపవాదును తొలగించుకోవడానికే కేసీఆర్‌ శైవాలయాలపై దృష్టి పెడుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన రోజే దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేయాలనే తన నిర్ణయాన్ని సీఎం కేసీఆర్‌ సన్నిహితులకు తెలియజేయడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular