Homeజాతీయ వార్తలుToxic Fevers Rise in Telangana: బెడ్డుపై బాల్యం.. తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Toxic Fevers Rise in Telangana: బెడ్డుపై బాల్యం.. తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు

Toxic Fevers Rise in Telangana: తెలంగాణలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. చిన్నపిల్లలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, పైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణంగా 200 నుంచి 300 వరకు నమోదయ్యే ఓపీ వారం పది రోజులుగా 500 మించి నమోదవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిండిపోయాయి. పిల్లల వార్డుల్లో బెడ్లు సరిపోకపోవడంతో వైద్యాధికారులు అదనపు పడకలు ఏర్పాటు చేస్తున్నారు. జ్వర పీడితుల్లోల ఎక్కువ మంది 5 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు.

Toxic Fevers Rise in Telangana
Toxic Fevers Rise in Telangana

టైఫాయిడ్‌.. మలేరియా, డెంగీ ..
రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాల్లో ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని జిల్లాల్లో డెంగీ గేసులు కూడా వెలుగు చూస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చిన ప్రతీ జ్వరపీడితుడికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. దీంతో 60 శాతం టైఫాయిడ్, 30 శాతం మలేరియా, 10 శాతం డెంగీ కేసులు వెలుగు చూస్తున్నాయి.

Also Read: Free Schemes: ఫ్రీ’జాస్వామ్యం.. ఏది ఉచితం… ఏది అనుచితం

కిటకిటలాడుతున్న నిలోఫర్‌..
చిన్న పిల్లలకు చికిత్స అందించే నిలోఫర్‌ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. పది రోజులుగా వస్తున్న ఓపీ, ఐపీల్లో ఎక్కువగా జ్వరం కేసులే ఉంటున్నాయి. తీవ్రతను బట్టి వైద్యులు ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. పడకలు తక్కువగా ఉండడంతో కొద్దిగా కోలుకోకాగానే డిశ్చార్జి చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న మంచాలపై ఇద్దరిని ఉంచి చికిత్స చేస్తున్నారు.

వానల వెంటే.. వ్యాధులు..
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలు, ఇటీవల వచ్చిన వరదలతో జలాశయాలు, చెరువులు, కుంటలు, బావుల్లోకి కొత్త నీరు చేరింది. ఈ నీటిని క్లోరినేషన్‌ చేసి సరఫరా చేయాల్సి ఉండగా పంచాయతీ, మున్సిపల్‌ పాలకవర్గాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో కాచి చల్లార్చిన నీటిని తాగడం ద్వారా వ్యాధులను దూరం చేయవచ్చు. కానీ ప్రజలు కూడా దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో నీటి ద్వారా కూడా వ్యాధులు ప్రబలుతున్నాయి.

దోమలమోత..
కరోనా కారణంగా రెండేళ్లు దోమల బెడద పెద్దగా కనిపించలేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్‌ పాలకవర్గాలు వీధులన్నీ శానిటైజర్, బ్లీచింగ్‌ స్ప్రే చేయించాయి. దీంతో దోమలు వృద్ధి చెందలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో శానిటైజేషన్‌పై పాలకులు పెద్దగా దృష్టిపెట్టలేదు. ప్రభుత్వం పంచాయతీలకు మూడు నెలలుగా నిధులు కూడా కేటాయించడం లేదు. ఫలితంగా శానిటేషన్‌లోపిస్తోంది. దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయి. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. పలితంగా టైఫాయిడ్‌ మలేరియాతోపాటు డెంగీ కూడా విజృంభిస్తోంది.

Toxic Fevers Rise in Telangana
Toxic Fevers Rise in Telangana

కరోనా టెన్షన్‌..
సీజనల్‌ జ్వరాల లక్షణాలు, కరోనా లక్షణాలను పోలి ఉంటున్నాయి. జలుబు, దగ్గు, జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు ఉండడంతో సాధారణ జ్వరమా, కరోనానా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని రోజులుగా కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఇదే సమయంలో సీజనల్‌ జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో వైరస్‌ ఉన్నవారి నుంచి ఇతరులకు కూడా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది.

హాస్టళ్లలో వైరల్‌ జ్వరాలు..
కరోనాతో రెండేళ్లుగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాదే విద్యాసంస్థలు సమయానికి పునఃప్రారంభమయ్యాయి. హాస్టళ్లలో విద్యార్థులు చేరారు. తాజాగా వర్షాలకు హాస్టళ్లలోనూ పారిశుధ్యం లోపించి వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా నిత్యం ఏదో ఒక వసతి గృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. జ్వరంలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఇంటిబాట పడుతన్నారు. కొన్ని హాస్టళ్లలో కరోనా కేసులు కూడా వెలుగు చూస్తున్నాయి.

ప్రైవేటు దోపిడీ..
కరోనా కారణంగా ఏడాదిపాటు ఆస్పత్రులు దాదాపు మూతపడ్డాయి. ఫస్ట్‌ వేవ్‌ సమయంలో ఆస్పత్రికి వెళ్లడాకిని కూడా జనం భయపడ్డారు. దీంతో వైద్యులు తీవ్రంగా నష్టపోయారు. ఇక సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ ఇదే పరిస్థితి. అయితే కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు కోవిడ్‌ చికిత్సకు అనుమతి తెచ్చుకుని లక్షల రూపాయలు వసూలు చేశాయి. ఈ ఏడాది కోవిడ్‌ లేకపోవడంతో ఆస్పత్రుల్లో ఓపీ చార్జీలనే వైద్యులు భారీగా పెంచారు. ఇక చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్నారు. అవసరం లేకున్నా పరీక్షలు చేయిస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా అడ్మిషన్‌ చేసుకుని చార్జీలు తీసుకుంటున్నారు. డెంగీ కేసుల విషయంలో దోపిడీ ఎక్కువగా ఉంటుంది.

Also Read: Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version