తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలను జూన్‌ 8 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 8 నుంచి జూలై 5 వరకు పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్: జూన్‌ 8 – ఇంగ్లిష్‌ మొదటి పేపర్ జూన్‌ […]

Written By: Neelambaram, Updated On : May 22, 2020 5:04 pm
Follow us on

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన పదో తరగతి పరీక్షలను జూన్‌ 8 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 8 నుంచి జూలై 5 వరకు పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ ప్రకటించింది.

షెడ్యూల్:
జూన్‌ 8 – ఇంగ్లిష్‌ మొదటి పేపర్
జూన్‌ 11 – ఇంగ్లిష్‌ రెండో పేపర్
జూన్‌ 14 – మ్యాథ్స్‌ మొదటి పేపర్‌
జూన్‌ 17 – మ్యాథ్స్‌ రెండో పేపర్‌
జూన్‌ 20 – సైన్స్‌ మొదటి పేపర్‌
జూన్‌ 23 – సైన్స్‌ రెండో పేపర్‌
జూన్‌ 26 – సోషల్‌ మొదటి పేపర్
జూన్‌ 29 – సోషల్‌ రెండో పేపర్‌
జూలై 2న ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్ (సంస్కృతము, అరబిక్‌)
జూలై 5న (ఆదివారం) ఓరియంటర్‌ మొయిన్‌ లాంగ్వేజ్‌ రెండో పేపర్‌ (సంస్కృతము, అరబిక్‌)

హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా పరీక్ష షెడ్యూల్‌ను రూపొందించారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులందరూ భౌతిక దూరం పాటించేలా పరీక్షహాల్లో సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య కారణాల ఉంటే ప్రత్యేకంగా వేరే గదిలో పరీక్షలు నిర్వహిస్తారు. న్యాయస్థానం సూచనల మేరకు ఇప్పుడు పరీక్ష కేంద్రాలకు అదనంగా మరో 2,530 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అదనంగా 26,422 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనుంది. పరీక్షలన్నీ ఉదయం 9.30 నుంచి మధ్యాహం 12.15 నిమిషాలకు వరకు జరుగనున్నాయి.

పరీక్షల షెడ్యూల్ ఖరారైనందుకు విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను విజయంతంగా పూర్తి చేసుందని మంత్రి భరోసా ఇచ్చారు.