టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ కారణంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు వారి ఏరియాల్లో నిరాడంబరంగా పార్టీ జెండాలను ఆవిష్కరించాలని, తెలంగాణ అమరువీరుల నివాళులు అర్పించాలని కేసీఆర్ సూచించారు. ఈమేరకు రేపు(సోమవారం) ఉదయం 9.30గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఏ లక్ష్యం కోసమైతే ఆవిర్భవించిందో ఆ లక్ష్యాన్ని సాధించిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంతోపాటు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ తో కారణంగా పార్టీ వేడుకలను వైభవంగా నిర్వహించుకోలేక పోతున్నామని తెలిపారు. మరో సమయంలో పార్టీ 20ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకుందమని శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ నిబంధనలు పార్టీ కార్యకర్తలు పాటించాలని సూచించారు. కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు.