Telangana: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి

Telangana: తెలంగాణలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని గతంలోనే టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిశాయని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై ఘాటైన వ్యాఖ్యలు గుప్పించారు. బండి సంజయ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ […]

Written By: Neelambaram, Updated On : November 10, 2021 4:24 pm
Follow us on

KCR and Revanth Reddy

Telangana: తెలంగాణలో రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని గతంలోనే టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిశాయని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ఈ మేరకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై ఘాటైన వ్యాఖ్యలు గుప్పించారు.

బండి సంజయ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటయ్యాయనడానికి ఇదే నిదర్శనం అని తెలుస్తోందన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి పలు కోణాల్లో విమర్శలు చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయన్నది ఆయన మాటల్లోని ఆంతర్యం.

నీళ్లు, నిధులు, నియామకాలు లేకుండా టీఆర్ఎస్ నిర్లక్ష్యంగా పాలన చేస్తోంది. అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకు ఉందని చెబుతున్నారు. కేసీఆర్ పై ప్రజ్లలో వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోవడం లేదు. ఫలితంగా రాష్ర్టంలో అరాచక పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ లో ఓటమికి కూడా కారణం కేసీఆర్ చర్యలేనన్నారు.

మరోవైపు బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి సవాలుపై కూడా టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. సీబీఐ విచారణ చేయించాలని మొత్తుకుంటున్నా కేసీఆర్ అవినీతిపై విచారణకు ఎందుకు సిద్ధం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పాలన గురించి త్వరలో మేమే తగిన సమాధానం చెబుతామని చెప్పారు.

Also Read: ఫ‌స్ట్రేష‌న్ కేసీఆర్.. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌..!

రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందా..? ప్రయత్నాలు వృథానేనా..?

Tags