Telangana MLC polls: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఊహించిన ఫలితం రాకపోవడంతో టీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఈటల రాజేందర్ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అధికార పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో తెలంగాణలో మరోమారు టీఆర్ఎస్ పై బీజేపీ పట్టు సాధించడం గమనార్హం.

త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఏర్పడిన ఖాళీల భర్తీకి ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ పై మరో బాధ్యత ఏర్పడింది. మండలిలో ఆరు స్థానాలకు గాను గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బొడకుంటి వెంకటేశ్వర్లు, నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీ కాలం ముగియడంతో వీరిలో ఎంత మందికి మళ్లీ అవకాశం ఇస్తారనే దానిపైనే అందరి అంచనాలు నెలకొన్నాయి.
పదవులు ఆశిస్తున్న వారిలో తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, రామ్మోహన్ గౌడ్, బండి రమేష్, బొంతు రామ్మోహన్, మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కోటిరెడ్డి, కర్నె ప్రభాకర్, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తదితరులు ఆశిస్తున్నారు.
Also Read: ప్రజలన్నీ చూస్తూ ఉంటారు.. సమయమొచ్చినప్పుడే చెప్తారు..
వీరందరు పదవులు ఆశిస్తుండటంతో వీరిలో ఎవరి కోరికలు తీరుస్తారో అనే అనుమానం అందరిలో నెలకొంది. దీంతో హుజురాబాద్ పరిణామాలతో అందరు కూడా పదవి రాకపోతే పార్టీ మారి బీజేపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కేసీఆర్ కు మరో ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది.
Also Read: BJP In Telangana : తెలంగాణలో బీజేపీ అతివిశ్వాసం కొంప ముంచుతుందా?