Modi vs KCR: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించి ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసిరింది. బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ విజయవంతంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కలుగుతోంది. వేదిక మీదే ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భుజం తట్టడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి మాత్రం మింగుడు పడటం లేదు. బీజేపీ ఇంత విజయవంతంగా సభ నిర్వహిస్తుందని ఊహించలేదు. దీంతో ప్రత్యర్థి పార్టీల్లో అలజడి రేగుతోంది.

2024 ఎన్నికల కోసం బీజేపీ పూరించిన శంఖారావం సక్సెస్ కావడంతో పార్టీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది. సభ సక్సెస్ తో కొత్త ఉత్సాహం పెరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ ద్వారా టీఆర్ఎస్ కు సమాధానం చెప్పడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలను కనీసం పట్టించుకోకుండా తమ పార్టీ చేపడుతున్న పథకాల గురించే మాట్లాడటం గమనార్హం.
Also Read: PM Modi- Raghurama krishnam Raju: రఘురామ ఇష్యూ: వైసీపీకే మోడీ సపోర్ట్
ప్రధాని కేంద్రం చేపడుతున్న పథకాల గురించి మాత్రమే మాట్లాడారు. కేసీఆర్ వేసిన ప్రశ్నలను కనీసం పట్టించుకోలేదు. దీంతో వారికి పరోక్ష సందేశం ఇచ్చినట్లయింది. మీ స్థాయి మమ్మల్ని విమర్శించేంత లేదని సంకేతం ఇచ్చినట్లు అయింది. ఈ క్రమంలో హైదరాబాద్ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ నేతల్లో అయోమయం పట్టుకుంది. సభకు ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు రావడంతో కంగుతిన్నారు. ప్రధాని సైతం జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంత మంది వస్తారని అంచనా వేయకపోవడమే కారణం.

బీజేపీ నేతలందరు టీఆర్ఎస్ ను విమర్శించినా ప్రధాని మోడీ మాత్రం తమ ప్రభుత్వ విధానాలు మాత్రమే చెప్పి కేసీఆర్ ను ఒక్క మాట అనకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ కేసీఆర్ ను విమర్శిస్తే మన స్థాయి కూడా పడిపోతుందనే ఉద్దేశంతోనే ప్రధాని అలా మాట్లాడారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ కు మాత్రం గట్టి షాకే ఇచ్చారు. ప్రధాని తప్ప మిగతా వారందరు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కుటుంబ పాలన, అవినీతి గురించి ప్రస్తావించి బీజేపీకి బ్రహ్మరథం పట్టాలని కోరారు. దీంతో బీజేపీ సభ విజయవంతంతో టీఆర్ఎస్ కు మాత్రం హెచ్చరిక చేసినట్లు అయింది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో బీజేపీ భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Alluri Sitarama Raju: అల్లూరి జయంతి స్పెషల్: పరాక్రమ పోరాటంలో ఎవరికీ తెలియని నిజాలు
[…] […]
[…] […]