https://oktelugu.com/

కొత్త సచివాలయం ఫైనల్ డిజైన్ వచ్చేసిందిగా?

తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటకు తిరుగులేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన ఏదైనా కావాలని మంకుపట్టుపడితే అది పూర్తయ్యే వరకు ఊరుకోరు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తమ వాదనను హైకోర్టులో బలంగా విన్పించడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి కోర్టు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 7, 2020 / 12:05 PM IST
    Follow us on


    తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటకు తిరుగులేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆయన ఏదైనా కావాలని మంకుపట్టుపడితే అది పూర్తయ్యే వరకు ఊరుకోరు.. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజులుగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తమ వాదనను హైకోర్టులో బలంగా విన్పించడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

    చిచ్చుపెట్టిన కరోనా.. కేసీఆర్ తో గవర్నర్ ఫైట్?

    దీంతో సీఎం కేసీఆర్ కోరుకున్నట్లు కొత్త సచివాలయ నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలిగాయి. దీనిపై విపక్షాలు సుప్రీంలో సవాల్ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈమేరకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి సచివాలయాన్ని కూల్చివేసేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చారు. దీంతో ఇవాళ్టి నుంచి సచివాలయ కూల్చివేత పనులను చేపడుతున్నారు. సచివాలయానికి వెళ్లే రహదారులను మూసివేసి అధికారుల పర్యవేక్షణలో పనులు చేపడుతున్నారు. మొదటగా జి, సి బ్లాక్ కూల్చివేయనున్నారు.

    వైసీపీ నేతల జేబులు నింపుతున్న మద్యం విధానం

    పాత సచివాలయ కూల్చివేత పనులు జరుగుతుండగానే కొత్త సచివాలయ డిజైన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ కొత్త డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధునాతన హంగులతో తీర్చిదిద్దిన సచివాలయ డిజైన్ అదిరిపోయిందనే టాక్ విన్పిస్తోంది. ఈ డిజైన్ కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అయితే పాత సచివాలయం కూల్చకుండా కరోనా ఆస్పత్రికి చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా కూల్చివేత పనులు చేసుకుంటూ ముందుకెళుతోంది. త్వరలోనే ఆధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మాణాన్మి పూర్తిచేసి సీఎం కేసీఆర్ ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు.