తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడురోజులేనా?

తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సమావేశాలు కేవలం వారంరోజులు మాత్రమే జరిగేలా కన్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను 15నుంచి 20రోజులపాటు నిర్వహించేలా అధికారులకు సూచించినప్పటికీ అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కుదింపుకే అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారం నుంచి పదిరోజులపాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. Also Read: మౌనమే కేసీఆర్ ఆయుధం! ఈమేరకు […]

Written By: Neelambaram, Updated On : August 20, 2020 3:29 pm
Follow us on


తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ సమావేశాలు కేవలం వారంరోజులు మాత్రమే జరిగేలా కన్పిస్తున్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలను 15నుంచి 20రోజులపాటు నిర్వహించేలా అధికారులకు సూచించినప్పటికీ అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల కుదింపుకే అధికారులు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వారం నుంచి పదిరోజులపాటు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also Read: మౌనమే కేసీఆర్ ఆయుధం!

ఈమేరకు సెప్టెంబర్ 7నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈమేరకు అధికారులు సన్నహాలు చేస్తున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సమావేశాలు కేవలం ఏడు నుంచి పదిరోజుల్లో ముగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో శాసన మండలి సమావేశాలు ఐదురోజులపాటు నిర్వహించాలనే ప్రభుత్వం యోచిస్తోంది. ఇక కరోనా నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సీట్ల మధ్య దూరం.. అసెంబ్లీని శానిటైజ్ చేయడం.. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సమాశాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిలు అధికారులతో సమీక్షించనున్నారు. ఏర్పాట్లపై స్పష్టత వచ్చాక సీఎం కేసీఆర్ తో చర్చించి అసెంబ్లీ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ, ఎఫ్‌ఆర్‌బీఎం, ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసు 65ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్స్‌లు చర్చకు రానున్నాయి.

Also Read: చివరికి బాబు మెడకు చుట్టుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు !

వీటితోపాటు సాగునీటి విభాగం పునర్వ్యవస్థీకరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, నియంత్రిత సాగు, నూతన సచివాలయ భవన నిర్మాణం అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇటీవల మృతిచెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనుంది. వీటితోపాటు పలు బిల్లులపై సమావేశాల్లో చర్చించనున్నారు. ఇక మార్చిలో అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం కరోనా కారణంగా గడువుకు ముందే అర్ధాంతరంగా ముగించింది.

తాజాగా మరోసారి వర్షాకాల సమావేశాలు కూడా కేవలం ఏడురోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండటంతో కీలక బిల్లులపై ఏమేరకు చర్చలు జరుగుతాయనే సందేహాలు మాత్రం కలుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై ఎలా ముందుకెళుతుందో వేచి చూడాల్సిందే..!