తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం దాటేవరకూ కొనసాగుతూనే ఉంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు నల్గొండలో చేపట్టారు. ఇక్కడి రాష్ట్ర గిడ్డంగుల సంస్థలోని గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. తొలుత 25 ఓట్ల చొప్పున బ్యాలెట్ కట్టలు కడుతున్నారు.
Also Read: ఏపీలో పరిషత్ ఎన్నికలు నిమ్మగడ్డే నిర్వహించాలట..!
మరోవైపు.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సరూర్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3, 57, 354 ఓట్లు పోల్ అయ్యాయి. బండిల్స్ కట్టే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే సరికి రాత్రి 8 దాటే అవకాశం కనిపిస్తోంది. అర్ధరాత్రి లోపు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో టీఆర్ ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. టీజేఎస్ నుంచి కోదండరామ్, వామపక్షాల అభ్యర్థిగా జయసారథి రెడ్డి పోటీలో ఉన్నారు. యువతెలంగాణ పార్టీ అభ్యర్థిగా రుద్రమదేవి, ఇండిపెండెంట్ గా తీన్మార్ మల్లన్న ఉన్నారు.
Also Read: మా 1200 కోట్లు ఎప్పుడిస్తారు?.. ఏపీని ప్రశ్నించిన కేంద్ర ప్రభుత్వం!
ఇక, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచంద్రరావు, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉన్నారు. కౌంటింగ్ జోరుగా కొనసాగుతుండడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే.. హైదరాబాద్ స్థానంలో నాగేశ్వర్, వరంగల్‌స్థానంలో కోదండరామ్ లీడ్ లో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్