https://oktelugu.com/

ఏపీ బెల్ట్ షాప్ లలో తెలంగాణ మద్యం హల్ చల్

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నా తెలంగాణ నుండి మద్యం అక్రమంగా ఏపీలో విస్తృతంగా అమ్మడానికి మాత్రం దోహదపడుతున్నది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఎక్సైజ్‌‌ పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం షాప్స్ నడిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి […]

Written By: , Updated On : March 3, 2020 / 04:05 PM IST
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య నెలకొన్న రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజనకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో ఒక్కడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నా తెలంగాణ నుండి మద్యం అక్రమంగా ఏపీలో విస్తృతంగా అమ్మడానికి మాత్రం దోహదపడుతున్నది. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఉన్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఎక్సైజ్‌‌ పాలసీ తీసుకొచ్చింది. ప్రభుత్వమే మద్యం షాప్స్ నడిపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే మద్యం అమ్ముతున్నారు. గరిష్ట అమ్మకాలపై పరిమితి విధించారు. దీంతో మందుబాబులకు ఇబ్బందులు తప్పలేదు. కానీ బెల్ట్‌‌ షాపుల నిర్వాహకులకు ఫుల్‌‌ గిరాకీ ఉంటోంది. బ్లాక్‌‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

అక్రమంగా అమ్ముడవుతున్న మద్యం మొత్తం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి అక్రమంగా తరలించిందేనని ఇటీవల తనిఖీల్లో బయటపడుతోంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న షాపులతో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్‌‌లో యథేచ్ఛగా తెలంగాణ లిక్కర్ను అమ్ముతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని ఏపీ సరిహద్దు జిల్లాల వైన్స్‌‌లకు ఫుల్ గిరాకీ ఉంటోంది. నల్లగొండ, సూర్యాపేట, గద్వాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌‌కర్నూల్‌‌, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో అమ్మకాలు పెరిగాయి. ఆయా దుకాణాల్లో గతంలో రోజుకు లక్ష వరకు విక్రయాలు జరగ్గా, ప్రస్తుతం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెరగడం గమనార్హం.

రాష్ట్రంలో మద్యం అక్రమ తరలింపు అడ్డుకట్ట కోసం ప్రత్యేకంగా ఎక్సైజ్‌‌ చెక్‌‌పోస్టులు ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల సరిహద్దులకు చెక్‌‌పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం తరలించాలంటే ఈ చెక్‌‌పోస్ట్‌‌లను దాటుకుని వెళ్లాలి.

అయితే ఎక్సైజ్ అధికారులు కూడా పట్టించుకోపోవడం, చూసిచూడనట్లు వదిలేయడంతో రాత్రికి రాత్రే వాహనాల్లో అక్రమ మద్యాన్ని బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు కుమ్మక్కై మద్యాన్ని ఏపీకి చేరుస్తున్నారు. తెలంగాణ ఎక్సైజ్‌‌ శాఖ తీరు ఇలా ఉండగా, ఏపీలో ఎక్కడికక్కడ తనిఖీల్లో తెలంగాణ మద్యం పట్టుబడుతోంది.