TS govt Go`s:ప్రభుత్వ జీవోలు ఎందుకు దాచేస్తున్నారు?

అటు ఏపీ అయినా.. ఇటు తెలంగాణ అయినా అదే పని.. ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా బ్లాంక్ జీవోలు విడుదల చేసిందన్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో లేకుండా దాచేసిందన్న అపవాదును మూటగట్టుకుంది. నిజానికి ప్రభుత్వ జీవోలు విడుదల చేస్తే ప్రతిపక్షాలు, ప్రజలు వాటిల్లోని లూప్ హోల్స్ ను పసిగట్టి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న సందర్భాలున్నాయి. మీడియా అయితే చెప్పక్కర్లేదు. అందుకే ఏపీలో బ్లాంక్ జీవోలు.. తెలంగాణలో అసలు […]

Written By: NARESH, Updated On : August 18, 2021 4:01 pm

High Court

Follow us on

అటు ఏపీ అయినా.. ఇటు తెలంగాణ అయినా అదే పని.. ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు తెలియకుండా బ్లాంక్ జీవోలు విడుదల చేసిందన్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఎదుర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో లేకుండా దాచేసిందన్న అపవాదును మూటగట్టుకుంది.

నిజానికి ప్రభుత్వ జీవోలు విడుదల చేస్తే ప్రతిపక్షాలు, ప్రజలు వాటిల్లోని లూప్ హోల్స్ ను పసిగట్టి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్న సందర్భాలున్నాయి. మీడియా అయితే చెప్పక్కర్లేదు. అందుకే ఏపీలో బ్లాంక్ జీవోలు.. తెలంగాణలో అసలు వెబ్ సైట్ లోనే జీవోలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది.

వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయకుండానే దళితబంధు నిధులు విడుదల చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్ సైట్ లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

దీనిపై ప్రభుత్వం తరుఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ప్రసాద్ స్పందించారు. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందని.. నిబంధనలు ఖరారు చేసినట్లు తెలిపారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ పిటీషన్ లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటీషనర్ ను ప్రశ్నించింది. పథకానికి సంబంధించిన నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్ సైట్ లో లేదని పిటీషనర్ తరుఫు న్యాయవాది శశికరణ్ న్యాయస్థానానికి వివరించారు.

జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని హైకోర్టు తెలంగాణ సర్కార్ ను ఘాటుగా ప్రశ్నించింది. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏజీ వివరణ నమోదు చేసిన ధర్మాసనం.. దళితబంధుపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగించింది.