Telangana Govt Jobs Notification: తెలంగాణ సర్కారు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగానే నోటిఫికేషన్ల విడుదలకు సంకల్పిస్తోంది. ఈ మేరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. టెట్ పేపర్ -2కు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులైనని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో బీఈడీ అభ్యర్థులు కూడా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే అవకాశాలున్నాయి.

రాష్ర్టంలో 13,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రక్రియ వేగవంతం కానుంది. దీంతో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం రావడంతో వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారు. దీని కోసం శ్రమిస్తున్నారు. దీనికి సంబంధించిన వ్యవహారాల్ని పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించింది.
Also Read: టీఆర్ ఎస్ నేతల్లో ఐటీ దాడుల గుబులు.. కేంద్రం గట్టిగానే డిసైడ్ అయిందా…?
సీఎం కేసీఆర్ సూచన మేరకు మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి మార్గదర్శకాలు విడుదల చేస్తున్నారు. ఆర్థిక శాఖ అధికారులతో కూడా భేటీ అయ్యారు. వారి సూచనల మేరకు పచ్చజెండా ఊపారు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. ఇతర ఖాళీలపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుని వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగం పరితపించే వారి ఆశలు నిజమయ్యేలా కేసీఆర్ ఉద్యోగాల భర్తీ కోసం సుముఖంగా ప్రకటన చేయడంతో అందరిలో ఆనందం కనిపిస్తోంది. కోచింగ్ సెంటర్లు కూడా కళకళలాడుతున్నాయి. పోటీ పరీక్షల్లో నెగ్గి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తాపత్రయంలో నిరుద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పది, ఇంటర్ అర్హతతో ప్రకాశం జిల్లాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?
Recommended Video: