రూ 3 లక్షల కోట్ల అప్పుల్లో కేసీఆర్!

మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను రూ 3 లక్షల కోట్ల అప్పుల్లొకి ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టివేశారని అంటున్నారు నిజామాబాదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం నుండి సుమారు రూ 2 లక్షల కోట్లు లభించాయని చెబుతూ కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పక పోతే, తప్పు తేలితే ఫామ్‌‌‌‌హౌజ్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించే కార్యక్రమాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. ఆరేళ్లలో కేంద్రం దాదాపు రూ.1.52 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని కేంద్ర ఆర్ధిక […]

Written By: Neelambaram, Updated On : February 13, 2020 11:53 am
Follow us on

మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణను రూ 3 లక్షల కోట్ల అప్పుల్లొకి ముఖ్యమంత్రి కేసీఆర్ నెట్టివేశారని అంటున్నారు నిజామాబాదు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. కేంద్రం నుండి సుమారు రూ 2 లక్షల కోట్లు లభించాయని చెబుతూ కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పక పోతే, తప్పు తేలితే ఫామ్‌‌‌‌హౌజ్ నుంచి శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించే కార్యక్రమాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.

ఆరేళ్లలో కేంద్రం దాదాపు రూ.1.52 లక్షల కోట్లను రాష్ట్రానికి ఇచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్ లో చెప్పారు. జీఎస్టీ పన్నుల పరిహారం, లోకల్‌‌‌‌బాడీలకు నిధులు, కేంద్ర పథకాల వాటాను కలుపుకుంటే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిందని అరవింద్ వివరించారు.

ఫెర్టిలైజర్స్ సబ్బిడీ, రేషన్‌‌‌‌బియ్యంపై సబ్సిడీ, ఉపాధిహామీ నిధులు, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్‌‌‌‌ యోజన వంటి సబ్సిడీ స్కీమ్‌‌‌‌ ఫండ్స్‌‌‌‌ ఈ లిస్ట్‌‌‌‌లో లేవన్నారు. ఫైనాన్స్‌‌‌‌పవర్ కార్పొ రేషన్ నుంచి రూ 70 వేల కోట్లు, బ్యాంకుల నుంచి వంద కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుందని తెలిపారు.

కేంద్ర నిధులు, అప్పుల రూపంలో సమకూరిన రూ. 6 లక్షల కోట్లను రాష్ట్ర సర్కార్ ఏం చేసిందని ప్రశ్నించారు. కేవలం రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలే నడుస్తున్నాయని.. వీటి పేర్లతో కేసీఆర్ పైసలు లోపల వేసుకున్నారని ఆరోపించారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలని విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్.. నిధులు కావాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని పైసలు ఇవ్వాలని కోరితే, ప్రశ్నలు అడుగుతుందనే భయంతోనే ఫండ్స్‌‌‌‌ కావాలని అడగడం లేదని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)లో రాష్ట్రానికి కేసీఆర్ పెద్ద గుడ్డు (గాడిద గుడ్డు) మిగిల్చారని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలు పీఎంఏవై ఫేజ్-1, ఫేజ్-2 లో భాగంగా పేద ప్రజల కోసం 20 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాయని, చివరకు కొత్త కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన లఢక్‌‌‌‌లోనూ 12 వందల ఇండ్లు కట్టారని చెప్పారు. అయితే, అన్ని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మాత్రమే సున్నాతో నిలిచిందని ధ్వజమెత్తారు.

డబుల్ బెడ్ రూమ్‌‌‌‌ ఇండ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన సర్కార్, పేద మహిళలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టారు. పీఎంఏవైలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని, అయితే, ఆ నిధుల వినియోగం, ఖర్చుల వివరాలు కోరితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.