కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లు ఇచ్చిన టీ సర్కార్?

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు తెలంగాణ సర్కార్ చెబుతున్న ఖర్చులు నమ్మశక్యంగా ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ సర్కార్ కేటాయించిన ఓ నిధులపై ఓ లెక్చరర్ హైకోర్టుకు ఎక్కారు. అందులో తరిచి చూడగా.. ఆశ్చర్యకర విషయాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా […]

Written By: NARESH, Updated On : August 4, 2021 1:50 pm
Follow us on

అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇప్పుడు తెలంగాణ సర్కార్ చెబుతున్న ఖర్చులు నమ్మశక్యంగా ఉండడం లేదన్న వాదన వినిపిస్తోంది. తాజాగా తెలంగాణ సర్కార్ కేటాయించిన ఓ నిధులపై ఓ లెక్చరర్ హైకోర్టుకు ఎక్కారు. అందులో తరిచి చూడగా.. ఆశ్చర్యకర విషయాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి.

కోర్టు ధిక్కరణ కేసుల ఖర్చులకు తెలంగాణప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఓ లెక్చరర్ దాఖలు చేసిన పిల్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్లు మంజూరు చేయడమేంటని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

అంతటితో వదిలిపెట్టకుండా అసలు తెలంగాణ ప్రభుత్వం ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తుందో వివరించాలని.. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని ఆదేశించింది.

ఈ వ్యవహారంపై రెవెన్యూ, ఆర్థికశాఖ కార్యదర్శులతోపాటు సీసీఎల్ఏ, ట్రెజరీ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్ సోమేశ్ కుమార్ కు వ్యక్తిగత హోదాలో నోటీసులు ఇచ్చింది. అనంతరం విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది.

ఒక్క కోర్టు ధిక్కరణ కేసులకే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.58 కోట్లు కేటాయించడం సంచలనమైంది. ఇంత వ్యయం అవసరమా? అని ప్రతిపక్షాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పుడీ వ్యవహారం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.