Omicron Effect: తెలంగాణలో ‘ఒమిక్రాన్’ ఆంక్షలు.. వేడుకల్లేవ్.. ఇక ఇవి పాటించడం తప్పనిసరి

Omicron Effect: అన్నట్టే ఈ పాడు మహమ్మారి మనల్ని చుట్టుముడుతున్నట్టు కనిపిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా తన రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో ‘డెల్టా’ వేరియంట్ తో దేశంలో వినాశనం చోటుచేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే యూరప్, అమెరికాను గుప్పిటపట్టి అల్లాడిస్తోంది. ఇప్పుడు దేశంలో ఈ కొత్త వైరస్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే […]

Written By: NARESH, Updated On : December 25, 2021 6:43 pm
Follow us on

Omicron Effect: అన్నట్టే ఈ పాడు మహమ్మారి మనల్ని చుట్టుముడుతున్నట్టు కనిపిస్తోంది. చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా తన రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ లో ‘డెల్టా’ వేరియంట్ తో దేశంలో వినాశనం చోటుచేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో రూపాంతరం చెందిన కొత్త కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే యూరప్, అమెరికాను గుప్పిటపట్టి అల్లాడిస్తోంది. ఇప్పుడు దేశంలో ఈ కొత్త వైరస్ కేసులు చాపకింద నీరులా పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, ఒడిషా, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఆంక్షలు మొదలయ్యాయి. తెలంగాణలోనూ తాజాగా అమల్లోకి వచ్చాయి.

ఒమిక్రాన్ వేరియంట్ దూసుకొస్తున్న నేపథ్యంలో పలువురు హైకోర్టుకు ఎక్కగా.. హైకోర్టు ఆదేశానుసారం తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ చర్యలకు దిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనల మేరకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆంక్షలు అమలు చేయనుంది.

జనవరి 2వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు.కొన్ని నియంత్రణ చర్యలతో జన సమూహం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనున్నారు. ఆయా కార్యక్రమాలు జరిగే వేధిక వద్ద భౌతికదూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆంక్షలు విధించారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో క్రిస్ మస్, నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకలను నియంత్రించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.దీంతో తెలంగాణలో ఇక నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.