తెలంగాణలో ఖాళీలివీ.. ఇవీ ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణలో 50వేల ఉద్యోగలు ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు వడివడిగా ముందుకెళుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే అంశాన్ని అందులో ప్రకటించింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ పోస్టుల విభజన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల కింద […]

Written By: NARESH, Updated On : August 8, 2021 9:34 am
Follow us on

తెలంగాణలో 50వేల ఉద్యోగలు ప్రకటించిన ప్రభుత్వం ఈ మేరకు వడివడిగా ముందుకెళుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయి పోస్టులను గుర్తిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏ పోస్టులు ఏ పరిధిలోకి వస్తాయనే అంశాన్ని అందులో ప్రకటించింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం క్యాడర్ పోస్టుల విభజన జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. వివిధ హోదాలను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల కింద విభజించింది. అయితేపెండింగ్ లో ఉన్న ప్రాంతాలను కపలించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దీంతో మిగిలిన జోన్ లకు పరిష్కారం కూడా లభించనుంది.

అన్ని సమస్యలు పరిష్కారం కావడంతో 50వేల ఉద్యోగుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఖాళీ ఉన్న వాటిని భర్తీ చేసేందుకు క్యాడర్ పోస్టుల విభజన చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టులను గుర్తిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. మిగిలిన వాటిని జోనల్, మల్టీ జోనల్ పోస్టులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు జిల్లా కేడర్ కింద గుర్తించగా.. సీనియర్ అసిస్టెంట్, ఆపై పోస్టులు జోనల్ కేడర్ కింద.. జిల్లా స్థాయి అధికారులు, ఇతర పోస్టులను మల్టీ జోనల్ కేడర్ కింద పరిగణించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

కొన్ని శాఖల్లో పక్కపక్క జిల్లాలను, పక్కపక్క జోన్లను కలిపి యూనిట్లుగా ఏర్పాటు చేసి పనలు రకాల పోస్టులను యూనిట్ల పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ పోస్టు ఏ కేటగిరి కిందకు వస్తుందో.. క్యాడర్ విభజన చేస్తూ జీఓ 84లో అందుకు అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేసింది.

దీంతో కొన్ని లోకల్ క్యాడర్ పోస్టులు జోనల్ పోస్టులుగా మారాయి. స్టేట్ క్యాడర్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులుగా మారిపోయాయి. క్యాడర్ ఆధారంగా ప్రస్తుతమున్న ఉద్యోగులను ఆయా శాఖల్లో కేటాయింపు చేసి కొత్త పోస్టుల గుర్తింపు జరుగుతుంది. ఆ తర్వాత కాళీలపై స్పష్టత వస్తుంది. దీంతో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.