TS Junior Panchayat Secretary: సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలను తొలిగిస్తూ ప్రభుత్వం బిగ్ షాక్!

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో గ్రామపంచాయతీలో పనులకు ఆటంకం కలుగుతుంది. రికార్డుల నిర్వహణ గాడి తప్పుతోంది. వినేపద్యంలో సీఎం కేసీఆర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సమీక్ష నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : May 13, 2023 9:42 am

TS Junior Panchayat Secretary

Follow us on

TS Junior Panchayat Secretary: పక్షం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు విధుల్లో చేరని వారితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి స్పష్టం చేశారు. విధులకు హాజరుకాని వారి స్థానాల్లో కొత్త వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు.

రెగ్యులర్ చేయాలని సమ్మె..
నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అమ్మే ప్రారంభించారు. 15 రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ కార్యదర్శులు అందరూ విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. కానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రంగంలోకి దిగారు.

సీఎం ఆదేశాలతో..
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెతో గ్రామపంచాయతీలో పనులకు ఆటంకం కలుగుతుంది. రికార్డుల నిర్వహణ గాడి తప్పుతోంది. వినేపద్యంలో సీఎం కేసీఆర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై సమీక్ష నిర్వహించారు. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరేలా ఆదేశించాలని సీఎస్ కు సూచించారు. వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు విధుల్లో చేరని పంచాయతీ సెక్రటరీలను తొలగించినట్లే అని ప్రకటించారు. వారి స్థానాల్లో డిగ్రీ అర్హత ఉన్న వారిని తాత్కాలిక కార్యదర్శులుగా నియమించాలని సూచించారు.

లిస్ట్ పంపాలని ఆదేశం..
శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు విధులకు హాజరైన వారి లిస్టును పంపించాలని కలెక్టర్లను, జిల్లా పంచాయతీ అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సమ్మె విరమించని వారితో ఇక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండబోదని తెలిపారు. వారి స్థానాల్లో గతంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరీక్ష రాసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఏం జరుగుతుంది?
సి ఎస్ శాంతి కుమారి తాజా ఆదేశాల నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తారా.. పట్టువేడకుండా సమ్మె కొనసాగిస్తారా అన్న చర్చ జరుగుతుంది. సి ఎస్ ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు చర్చిస్తున్నారు. ప్రభుత్వ చర్యలను న్యాయపరంగా ఎదుర్కొనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం.