TS Govt Jobs 2022: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగం సాధించాలనే తపనతో ఉన్నారు. ఉద్యోగం పురుష లక్షణం అనడంతో సర్కారు కొలువు కొట్టాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. కోచింగ్ తీసుకుంటూ తమ మెదడు పనితీరును మెరుగుపరుచుకుంటున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధిస్తేనే భవిష్యత్ బంగారంగా ఉంటుందని భావిస్తున్నారు దీని కోసమే అహర్నిషలు శ్రమిస్తున్నారు.

ఆర్థిక శాఖ 30,453 ఉద్యోగాల భర్తీ కోసం పచ్చజెండా ఊపింది. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా మరో 3,334 ఉద్యోగాల భర్తీకి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక నిరుద్యోుల్లో ఆతృత మొదలైంది. ఫైర్, ఎక్సైజ్, అటవీ శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం గుర్తించడంతో వాటిలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగం సాధించడమే తమ కర్తవ్యంగా యువత కసరత్తు చేస్తోంది.
Also Read: JanaSena Party: ఉత్తరాంధ్ర జనసేనకు ఆయువు పట్టుగా మారుతోందా?
అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 92, సాంకేతిక సహాయకులు 32, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫార్స్ట్స్ 18, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 14, జూనియర్ అసిస్టెంట్ 21 ఖాళీలు ఉండటంతో వాటిని సాధించేందుకు నిరుద్యోగులు పోటీపడనున్నారు. తమ జీవిత గమ్యం చేరుకోవడంలో ఉద్యోగాలే కీలకం కావడంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోటీపరీక్షల్లో నెగ్గి ఉన్నతంగా ఎదగాలని భావిస్తున్నారు.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ మేరకు అనుమతిలిస్తూ జీవోలుజారీ చేయనుంది. దీంతో ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఆర్థిక శాక మంత్రి హరీశ్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. నిరుద్యోగుల కల నెరవేరనుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు విధి విధానాలు ఖరారు చేస్తోంది.
Also Read:MIM Akbaruddin: విద్వేష వ్యాఖ్యలు.. ‘అక్బరుద్దీన్’ సేఫ్… అసలేం జరిగింది? ఎందుకు వీగిపోయింది?
[…] Yash- NTR: కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. మొదటగా రిలీజైన కేజీఎఫ్ సినిమా ఇండియన్ సినిమాలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా విడుదలయిన అన్ని చోట్లా రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన యష్ భారీ క్రేజ్ తో అన్ని భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఒక్క యష్ మాత్రమే కాదు. సినిమాలో నటించిన ఇతర నటులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందారు. చాప్టర్ 2 కూడా రికార్డుల సృష్టించనుంది. […]
[…] Telangana Politics: తెలంగాణల రాజకీయం వేడెక్కుతోంది. రాజకీయ పార్టీలు ముమ్మరంగా వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర నిన్నటి నుంచి ప్రారంభించారు. పాదయాత్రలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని చెబుుతున్నారు. ఈ యాత్ర మే 14 వరకు కొనసాగనుంది. దీంతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని బండి పేర్కొన్నారు. […]