కరోనా కోరలను వంచుతున్న తెలంగాణ

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసిన ఈ పేరే.. కంటికి కన్పించకుండానే ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు. కరోనా పేరు చెబితేనే అగ్రరాజ్యలు సైతం భయపడిపోతుంటే.. తెలంగాణవాసులు కరోనా మహమ్మరిపై విజయం సాధిస్తున్నారు. ఇది భారతీయులందరికీ […]

Written By: Neelambaram, Updated On : March 25, 2020 4:33 pm
Follow us on

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసిన ఈ పేరే.. కంటికి కన్పించకుండానే ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తోంది. చైనాలోని వూహాన్ పుట్టిన కరోనా మహమ్మరి క్రమంగా అన్ని దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో దేశమంతటా 21రోజులపాటు లాకౌడౌన్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 8గంటలకు ప్రకటించారు. ప్రధాని నిర్ణయానికి దేశ ప్రజలంతా స్వాగతించారు.

కరోనా పేరు చెబితేనే అగ్రరాజ్యలు సైతం భయపడిపోతుంటే.. తెలంగాణవాసులు కరోనా మహమ్మరిపై విజయం సాధిస్తున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ఇప్పటికీ తెలంగాణ 36కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా బాధితులకు సంబంధించి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించడంతో ఇటీవల ఒకరు కరోనా జయించారు. దీంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా మరొకరు కరోనా జయించడంతో తెలంగాణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కేసుల్లో చాలామంది కోలుకుంటుండటం అందరికీ శుభవార్త అని చెప్పొచ్చు.

ఈనెల 12న ఇటలీ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి వచ్చిన విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వెంటనే ఆ విద్యార్థిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రి వైద్యాధికారులు విడుదల చేసిన తాజా రిపోర్టులో ఆ విద్యార్థికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తూ బాధితుల ప్రాణాలను రక్షిస్తున్న వైద్య సిబ్బందికి ప్రతీఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.