ఎందరో ప్రాణత్యాగాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ర్టం ఏర్పడింది. జూన్2, 2014లో రాష్ర్ట ఆవిర్భావం జరిగింది. 29వ రాష్ర్టంగా తెలంగాణ కల సాకారమైంది. 58 ఏళ్ల పాటు వివక్షకు గురైన ప్రజలు రాష్ర్ట సాధనకు ఎంతో శ్రమించారు. అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటం వెరసి రాష్ర్ట ఏర్పాటు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ర్టం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
గత ఆరేళ్లుగా ప్రజల ఆకాంక్షల కసం పన చేస్తున్నారు. దేశానికే తలమానికంగా నిలుస్తోంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోంది. ఉద్యమ నేతగా కేసీఆర్ సీఎంగా రెండోసారి పదవి చేపట్టి రాష్ర్ట అభివృద్ధికి పునరంకితమయ్యారు. తె లంగాణ నినాదం ఎలా వచ్చింది? ఉద్యమం ఎలా ప్రారంభమైంది? ఈ ఏడేళ్ల కాలంలో ఎటు వైపు పయనించింది? అభివృద్ధి ఎలా ఉంది? అనే విషయాలపై దృష్టి పెడితే ప్రజలు కలలు కన్న తెలంగాణ ఇంకా రాలేదని తెలుస్తోంది. సుభిక్షమైన రాష్ర్ట ఏర్పాటుకు పాటుపడాల్సిన పాలకులు తమ అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ఉమ్మడి మద్రాసు రాష్ర్టం నుంచి ఆంధ్రరాష్ర్టం వేరుపడిన సమయంలో తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో తారాస్థాయికి చేరింది. తర్వాత మరుగునపడిపో యింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు గురించి గొంతెత్తి నినదించారు. ఈ సమయంలోనే2001 ఏప్రిల్ 21న కేసీఆర్ డిప్యూటీ పదవికి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.
ప్రత్యేక రాష్ర్టం కోసం ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2004లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతి ఎజెండాగా మారింది. ప్రత్యేక రాష్ర్టం కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేసీఆర్ దీక్షకు ప్రజలు మద్దతు తె లిపారు. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. కేసీఆర్ నిమ్స్ లో దీక్ష కొనసాగించడంతో ఓయూ విద్యార్థులు ఉద్యమానికి ఊతం ఇచ్చారు. దీంతో డిసెంబర్ 9న తె లంగాణ రాష్ర్ట ఏర్పాటు చేస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు.
ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో రాష్ర్టం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. అన్ని రంగాల్లో తన ప్రాభవాన్ని చూపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్ పల్లి, తోటపల్లి, సింగూర్, హల్దీవాగులతో రాష్ర్టం సస్యశ్యామలంగా మారుతోంది. సంక్షేమ రంగం ముందు వరుసలో నిలిచింది. రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీల కల నెరవేరబోతోంది. దీంతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి కూడా మెరుగైన దశలో ఉంది. దేశంలోని ధనిక రాష్ర్టాలలో తెలంగాణ ఉండడం గమనార్హం.
రైతుల సంక్షేమానికి సర్కారు పెద్దపీట వేసింది. రైతుబంధు పథకంతో అన్నదాతలకు అండగా నిలుస్తోంది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో రాష్ర్ట అభివృద్ధి సాగుతోంది. దేశానికి దిక్సూచిగా నిలుస్తోంది. పరిశ్రమలకు ప్రత్యేక రాయితీ ఇస్తోంది. సింగిల్ విండో విధానం ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. తెలంగాణలో ప్రత్యేకంగా హైదరాబాద్ లో పె ట్టుబడులు పెట్టేందుకు దోహదపడుతోంది. ఈ ఏఢాది కరోనా కారణంగా రాష్ర్ట అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం 10 మందికి మించకుండా కార్యక్రమం నిర్వహించాలని భావిస్తోంది.
తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించినా ఇంకా అనేక సమస్యలు మిగిలిపో యాయి. అందరికీ సంక్షేమ ఫలాలు అందడం లేదు. కొన్ని వర్గాలకే లబ్ది చేకూరుతోంది. దీంతో అర్హులకు మొండిచేయి చూపిస్తున్నారు. దీంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి అన్ని వర్గాల కోసం పని చేయాల్సి ఉంది. ప్రజలకు ఆపన్నహస్తం అందించి అభివృద్ధి ఫలాలు అందరికి దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Telangana completes seven years of formation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com