Telangana cabinet expansion: త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి రేసులో ఆ ముగ్గురు?

 Telangana cabinet expansion: తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలని అనుకుంటున్నారని తెలిసింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవడం, టీఆర్ఎస్ పార్టీకే పదవులు మొత్తం దక్కడంతో ఎమ్మెల్సీ కోటాలో ప్రస్తుతం మంత్రి పదవి ఎవరి దక్కుతుందో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి కేబినెట్ విస్తరణ జరిగితే బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులతో పాటే.. తెలంగాణ శాసన మండలిలో […]

Written By: Neelambaram, Updated On : December 16, 2021 1:39 pm
Follow us on

 Telangana cabinet expansion: తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించాలని అనుకుంటున్నారని తెలిసింది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తవడం, టీఆర్ఎస్ పార్టీకే పదవులు మొత్తం దక్కడంతో ఎమ్మెల్సీ కోటాలో ప్రస్తుతం మంత్రి పదవి ఎవరి దక్కుతుందో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి కేబినెట్ విస్తరణ జరిగితే బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Telangana cabinet expansion

నామినేటెడ్ పోస్టులతో పాటే..

తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో అధికార పార్టీకి ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. వీరితో కలుపుకుని టీఆర్ఎస్ బలం 36కు చేరింది. గవర్నర్‌ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలిపి మొత్తం 19 మంది ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. అయితే, కొత్తగా ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో కొందరు మంత్రి పదవులు ఆశిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం మండలిలో చైర్మన్, వైస్‌ చైర్మన్‌తో పాటు చీఫ్‌ విప్, మరో మూడు విప్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి.

మండలిలో ఇదివరకు చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోసారి మండలికి ఎన్నికయ్యారు. మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్‌ కోటాలో ఎంపికయ్యారు. గుత్తా మరోమారు చైర్మన్‌గా ఎన్నిక అవ్వొచ్చని తెలుస్తోంది. ఒకవేళ సామాజిక సమీకరణాల్లో భాగంగా మధుసూధనాచారి మండలి ఛైర్మన్ పదవి దక్కితే గుత్తాకు మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే చాన్స్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి రేసులో ఎవరెవరు ఉన్నారంటే?

ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. అందులో కవిత, బండప్రకాశ్, కడియం శ్రీహరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటల స్థానంలో ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి మంత్రిగా అవకాశం రావొచ్చు. ముఖ్యంగా బండా ప్రకాశ్ పేరు వినిపిస్తోంది. దీంతో పాటే మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్‌ పదవులను ఆశిస్తున్న వారిలో భానుప్రసాద్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి , రవీందర్‌రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్‌ హుస్సేన్, గంగాధర్‌గౌడ్‌‌లు కూడా ఉన్నారు.

ఇందులో కూడా సీఎం కేసీఆర్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల విమర్శలను రాజకీయంగా – పాలనా పరంగా దీటుగా ఎదుర్కొనే వారికి మంత్రిగా లేదా నామినేటేడ్ పోస్టులు కట్టబెడుతారని టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో బండా ప్రకాశ్, కడియం శ్రీహరి, కవిత పేర్లు ప్రధానం వినిపిస్తున్నాయి. అదేవిధంగా మండలి ప్రొటెమ్‌ ఛైర్మన్‌ పదవీకాలం జనవరి 4న ముగియనుంది. అయితే, కొత్త చైర్మన్‌ ఎన్నిక కోసం 2 రోజులు మండలిని ప్రత్యేకంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

Tags