Telangana Budget Session 2022: తెలంగాణలో శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. వాటిని సమర్థంగా ఎదుర్కోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిపై ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఇరుకున పెట్టాలని బీజేపీ, కాంగ్రెస్ లు పావులు కదుపుతున్నాయి.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై నిలదీయనున్నాయి. 317 జీవో, నిరుద్యోగుల సమస్య, శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం, బీజేపీపై ఆరోపణలు తదితర అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. ఇందుకోసం తగిన కార్యాచరణ ప్రణాళిక రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నట్లు సమాచారం.
తొలిరోజు ఆర్థికమంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సభలో గవర్నర్ ప్రసంగం లేనందున దీనిపై కూడా ప్రశ్నించాలని బీజేపీ అనుకుంటోంది. గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడానికి సీఎంకు ఏం అధికారాలు ఉన్నాయని కడిగేయడానికి సిద్ధమవుతోంది. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుందో అని వేచి చూస్తున్నారు. గవర్నర్ విషయంలో టీఆర్ఎస్ చేస్తున్న విధానంపై విరుచుకుపడాలనుకుంటోంది.
శాసనసభ, మండలి స్పీకర్లు శ్రీనివాస్ రెడ్డి, అమీనుల్ జాఫ్రీ సభ్యులకు సూచించారు. సభలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. హుందాగా వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో శాసనసభ నిర్వహణపై అందరిలో ఆసక్తి కలుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తీసు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సభలో సర్కారు తీరును ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తప్పు పట్టాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మారనున్నట్లు సమాచారం.
[…] Telangana Budget 2022-23: తెలంగాణ ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించింది. దీంతో పలు రంగాలకు బడ్జెట్ కేటాయించింది. దీన్ని హరీష్ రావు శాసనసభ వేదికగా వెల్లడించారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని కొనియాడారు. సమైక్యాంధ్రలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని చెబుతున్నారు. […]