Telangana BJP: భారతీయ జనతాపార్టీ.. నికార్సయిన, నిజమైన కార్యకర్తలు, సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసే కార్యడర్ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీనే. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా.. దేశవ్యాప్తంగా బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసే లక్షలాది క్యాడర్ ఉన్న పార్టీ. నరేంద్రమోదీ ప్రధాని అయ్యే ముంద వరకు ఈ సిద్దాంతానికే పార్టీ కట్టుబడి ఉంది. గెలుపు ఓటములు, అధికార, ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా ఏ సిద్ధాంతమైతే ఉందో.. అదే సిద్ధాంతంతో ముందుకు సాగింది. ఈ సిద్ధాంతమే బీజేపీని రెండు స్థానాల నుంచి 300 స్థానాలు సాధించే పార్టీగా చేసింది. కానీ మోదీ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా కాషాయ జెండా ఎగరాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారు. అయితే ఆకాంక్ష మంచిదే కానీ, దానికి అనుసరిస్తున్న విధానం, సిద్ధాంతాన్ని పక్కన పెట్టడమే పార్టీకి అపఖ్యాతి తెచ్చి పెడుతోంది.
ఆ కారణంగానే తెలంగాణలో బోల్తా..
తెలంగాణలో చాలా మంది బీజేపీ నాయకులు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ, దక్షిణాదిన బీజేపీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో నరేంద్రమోదీ, అమితషా ద్వయం పార్టీలోకి వలసలను ప్రోత్సహించింది. గెలిచే సత్తా ఉన్న ఏ పార్టీ నాయకులను అయినా చేర్చుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం చేరికల కమిటీనే ఏర్పాటు చేశారు. అప్పటికే బీజేపీ అధ్యక్షుడు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్వశక్తులూ ఒడుతున్నారు. ఈ తరుణంలో పార్టీ అధికార పార్టీని ఢీకొనేస్థాయికి ఎదిగింది. ఇలాంటి తరుణంలో పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు పలు పార్టీల నేతలు ఆసక్తి చూపారు. ఇందులో బలమైన నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. కానీ, ఇదే ఆ పార్టీకి మప్పుగా మారింది. వలస నేతలు పెరగడంతో తెలంగాణ బీజేపీలో సిద్ధాంతం పూర్తిగా పక్కకుపోయింది. క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో అలకలు, అసమ్మతులు, గ్రూపు రాజకీయాలు పెరిగాయి. అవి ఎక్కడి వరకు వెళ్లాయంటే.. అధ్యక్షుడిని మార్చేందుకు అధినాయత్వంపై ఒత్తిడి చేసేస్థాయికి చేరాయి. వలస నేతల మాటలు నమ్మి పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.
అధ్యక్షుడి మార్పుతో పడిపోతున్న గ్రాఫ్..
టీబీజేపీ అధ్యక్షుడి మార్పు.. అదే సమయంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ప్రభావం బీజేపీపై పడింది. బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడిన నేతలంతా సంజయ్ మార్పును వ్యతిరేకించారు. కానీ అధిష్టానం నిర్ణయమని గౌరవించి మౌనంగా ఉండిపోయారు. కానీ తర్వాత పరిస్థితి రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. ఏడాది క్రితం బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ సరిగ్గా ఎన్నికల సమయానికి రేసులో మూడో స్థానానికి చేరింది.
చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి..
వలస నేతలను నమ్ముకుని బీజేపీ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయింది. ఆ తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని భావించింది. కానీ అధిష్టానం నిర్ణయం తప్పని తేలిపోయింది. అసోం, బెంగాల్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, బీహార్, త్రిపుర, కర్ణాటకలో ఇలా వలస నేతలను ప్రోత్సహించి అధికారంలోకి రావాలని ప్రయత్నించింది. ఇందులో బెంగల్‌లో విఫలమైంది. అధికారం దరిదాపులకు వచ్చి ఆగిపోయింది. ఇక బీహార్‌తో జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. ఆ పార్టీనే కబళించే ప్రయత్నం చేసింది. దీనిని ఆదిలోనే గుర్తించిన నితీశ్‌కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వలస ఎమ్మెల్యేను ప్రోత్సహించి అధికారం చేపట్టింది. అయితే కార్ణటకలో తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. గోవా, అసోం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే పార్టీ పటిష్టంగా ఉంది. ఢిల్లీలో ఇలాంటి ప్రయత్నం చేసినా కేజ్రీవాల్ ముందు ఫలించలేదు.
అవన్నీ ఒక ఎత్తయితే.. తెలంగాణలో అధికారంలోకి రాకుండానే రాజగోపాల్‌రెడ్డి లాంటి వలస నేతలు పార్టీని డ్యామేజ్ చేశారు. ఆస్యంగా అయినా అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించాలని పార్టీ శ్రేణులు, బీజేపీ అభిమానులు కోరుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.