అగ్రి చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్‌

ఏ గ్రామానికి చెందిన రైతైనా.. తాను పండించిన పంటను ఎక్కడైనా విక్రయించి మద్దతు ధర పొందాలని పీఎం నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను రూపొందించారు. అయితే.. ఈ చట్టాలపై పెద్దగా స్టడీ చేయకుండానే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ వాటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాదు.. ఆ మధ్య చేపట్టిన రైతు బంద్‌కు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు.. ‘తెలంగాణ రైతు ఢిల్లీ వెళ్లి పంటను అమ్ముకోగలడా’ అంటూ స్పీచ్‌లు ఇచ్చారు. ఇదంతా కూడా గ్రేటర్‌‌ ఎన్నికలకు ముందు. […]

Written By: Srinivas, Updated On : December 28, 2020 4:58 pm
Follow us on


ఏ గ్రామానికి చెందిన రైతైనా.. తాను పండించిన పంటను ఎక్కడైనా విక్రయించి మద్దతు ధర పొందాలని పీఎం నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను రూపొందించారు. అయితే.. ఈ చట్టాలపై పెద్దగా స్టడీ చేయకుండానే తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌‌ వాటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంతేకాదు.. ఆ మధ్య చేపట్టిన రైతు బంద్‌కు కూడా మద్దతు తెలిపారు. అంతేకాదు.. ‘తెలంగాణ రైతు ఢిల్లీ వెళ్లి పంటను అమ్ముకోగలడా’ అంటూ స్పీచ్‌లు ఇచ్చారు. ఇదంతా కూడా గ్రేటర్‌‌ ఎన్నికలకు ముందు. ఇప్పుడు గ్రేటర్‌‌ ఫలితాల తర్వాత కేసీఆర్‌‌ తీరులో మార్పు వచ్చింది.

Also Read: సీఎం స్థాయిలో ఉండి మాట మార్చడం ఏంటి..?

తాజాగా.. మాట్లాడిన కేసీఆర్‌‌ వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా వాయిస్ మారుతోంది. రైతులకు మద్దతుగా భారత్ బంద్‌ను అధికారికంగా నిర్వహించిన సీఎం కేసీఆర్ తర్వాత సైలెంటయ్యారు. భారత్ బంద్ రోజు రోడ్డెక్కి ఆందోళన చేసిన కేటీఆర్, కవిత సహా టీఆర్ఎస్ నేతలందరూ.. తర్వాత వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్..ఆ చట్టాలకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఒకేసారిమద్దతు తెలిపితే విమర్శలు వస్తాయని అనుకున్నారేమో కానీ.. ఆ చట్టాల వల్ల ఉపయోగం ఉందన్నట్లుగా రైతులకు సలహాలిస్తున్నారు.

Also Read: ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది టీఆర్‌‌ఎసే కదా..!

రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నగదును 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షలో కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయం చేయాల్సిందేనని రైతులపై ఒత్తిడి తెచ్చిన ప్రభుత్వం.. ఇక అవసరం లేదని తేల్చేసింది. రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట వేసుకోవచ్చని కేసీఆర్ ప్రకటించేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా పంటలు కొనుగోలు చేయడం వల్ల ఏడున్నర వేల కోట్లు నష్టపోయిందని అధికారులు సమీక్షలో సీఎంకు తెలిపారు. కరోనా కారణంగా ప్రభుత్వం ఈ సారి పంటలు కొన్నదని.. ప్రతీసారి అలాగే చేయడం సాధ్యం కాదని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. మొత్తానికి వ్యవసాయ చట్టాలపై కేసీఆర్‌‌ యూటర్న్‌ తీసుకున్నట్లు కనిపిస్తోంది.