https://oktelugu.com/

Teenmar Mallanna: ఆ సత్తా బీజీపీకే ఉందంటున్న మల్లన్న.. కాంగ్రెస్ మీద ఘాటు కామెంట్స్

Teenmar Mallanna: తెలంగాణాలో రాజకీయాల హీట్ రోజురోజుకూ పెరుగుతుంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అటు అధికార పార్టీల నేతలు.. ఇటు విపక్ష పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బిజెపి నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణ అధికార పార్టీ అయినా టీఆర్ఎస్ ను పీఠం దించే సత్తా కాంగ్రెస్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 8:45 pm
    Follow us on

    Teenmar Mallanna: తెలంగాణాలో రాజకీయాల హీట్ రోజురోజుకూ పెరుగుతుంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అటు అధికార పార్టీల నేతలు.. ఇటు విపక్ష పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా బిజెపి నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

    Teenmar Mallanna

    Teenmar Mallanna

    తెలంగాణ అధికార పార్టీ అయినా టీఆర్ఎస్ ను పీఠం దించే సత్తా కాంగ్రెస్ కు లేదు అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు కానీ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలే ఆ పార్టీకి అతి పెద్ద మైనస్ అని తెలిపారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటంలో తప్పు పెట్టాల్సిన అవసరం తనకు లేదు అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్టగలిగే సత్తా ఒక్క బిజెపి కె ఉందని మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకుని బిజెపి కి మద్దతు ఇస్తే బాగుంటుందని తెలిపాడు. తెలంగాణ లో బిజెపి అధికారంలోకి వస్తే తొలి సంతకం విద్య, వైద్యం మీదనే అని మల్లన్న చెప్పుకొచ్చారు. బండి సంజయ్ కూడా ఈ మేరకు హామీ ఇచ్చినట్టు మరొకసారి గుర్తు చేసారు. ప్రతి పేదవాడికి ఉచిత విద్య, ఆస్పత్రిలో వైద్యం అందించడమే మా లక్ష్యం అని తెలిపాడు. తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా బిజెపి అడుగులు వేస్తుందని కేసీఆర్ పాలనా కు ప్రజలు విసిగి పోయారని మల్లన్న వ్యాఖ్యానించారు.

    Also Read: TRS: టీఆర్ఎస్‌ను కమ్మేసిన నిశ్శబ్దం.. సెలబ్రేషన్స్‌కు కేడర్ దూరం.. అసలేమైంది?

    వచ్చే ఎన్నికల్లో బిజెపి దే గెలుపు అని చెప్పుకొచ్చారు. నిజాయతీతో మాట్లాడే నాయకులూ బిజెపి లో చాలా మంది ఉన్నారని కేసీఆర్ డ్రామాలన్నీ తెలిసిపోయాయని ఇప్పటి వరకు బిజెపి పరిపాలనను ప్రజలు చూడలేదని ఇప్పుడు బిజెపి కి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బిజెపి ని అధికారంలోకి తీసుకు వచ్చేలా బీజీపీ లో ప్రతి కార్యకర్త పని చేస్తున్నాడని మల్లన్న పేర్కొన్నారు.

    Also Read:Harish Rao: ఆర్థిక, వైద్యశాఖపై కాకుండా విద్యుత్ శాఖపై హరీశ్ రావు సమీక్ష.. అసలు ఏం జరుగుతోంది?

    Tags