Tea Production: నిత్యావసరాల ధరలతో తల్లడిల్లుతున్న ప్రజలకు మరో “ధరా”ఘాతం. సామాన్యుడి నుంచి శ్రీమంతుల వరకు ప్రతి ఇంట్లో ఉండే, విరివిగా వాడే టీ పొడి ధరలు ఇకనుంచి పెరిగే అవకాశం ఉంది. ఇందుకు కారణం భారీ వర్షాలు. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అస్సాం, పశ్చిమ బెంగాల్ చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. దీంతో అక్కడి బ్రహ్మపుత్ర నది గత పది సంవత్సరాలల్లో ఎన్నడూ లేనివిధంగా ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. రోడ్లు మొత్తం కొట్టుకుపోవడంతో ప్రభుత్వానికి కోట్లలో నష్టం సంభవించింది.

తేయాకు పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ
భారీ వర్షాలకు సంభవించిన వరదల వల్ల తేయాకు తోటలకు నష్టం వాటిల్లింది. దేశంలోని మొత్తం తేయాకు ఉత్పత్తిలో 81% వాటా ఆస్సాం, పశ్చిమబెంగాల్ సొంతం. అంతటి తేయాకు పరిశ్రమ ప్రకృతి ప్రకోపానికి గురైంది. గతంలో ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలు, వెనువెంటనే సంభవించిన వరదలు తేయాకు పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
Also Read: Sreeleela: ఐటమ్ సాంగ్స్ కి క్రేజీ బ్యూటీ సై.. ఆ స్టార్ హీరో సినిమాలో ఫిక్స్
వర్షాల వల్ల అస్సాం రాష్ట్రంలో తేయాకు ఉత్పత్తి పడిపోయింది. మే నెలతో పోలిస్తే జూన్ లో తేయాకు ఉత్పత్తి శాతం తగ్గింది. బ్రహ్మపుత్ర లోయలో 11%, బరాక్ లోయలో 16% ఉత్పత్తి తగ్గింది. ఎత్తయిన ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల కొన్ని ఎస్టేట్ లలో తేయాకు మొక్కలు చనిపోయాయి. మరి కొన్నింటికి ఆకు కుళ్ళు వ్యాధి సోకడంతో ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. దేశీయ టి అవసరాలను అస్సాం, పశ్చిమబెంగాల్ తీరుస్తుండగా… ప్రస్తుత వర్షాలు నేపథ్యంలో భారతదేశం దిగుమతులపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.

సున్నితమైన పంట
వాస్తవానికి దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ ప్రాంతాలు మాత్రమే తేయాకు సాగుకు అనుకూలం. తమిళనాడులోని ఊటీ, నీలగిరి కొండల ప్రాంతంలో తేయాకు సాగవుతున్నప్పటికీ అది అస్సాం ను మించదు. తేయాకు తోటలు సున్నితమైన పంటలు. ఉష్ణోగ్రత ఎక్కువైనా కష్టమే. తక్కువైనా కష్టమే. తేయాకు తోటలు కరువును, వరదలను అసలు తట్టుకోలేవు. ఇక బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడంతో బెంగాల్ రాష్ట్రంలోని దూర్స్- తెరాయి టీ తోటల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఏకంగా జూన్ నెలలో 40 శాతం తగ్గుదల నమోదయింది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తేయాకు మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. దీని ఫలితంగా సగటు సూర్య రశ్మీ గంటలు తగ్గడంతో తేయాకులో ఆశించిన మేర ఉత్పత్తి జరగలేదు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఎగుమతులు తగ్గడం, పురుగుమందు ధరలు పెరగటం, కార్మికుల రోజువారి వేతనం పెరగడం కూడా తేయాకు రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుండటంతో గతంలో ఎన్నడు లేనివిధంగా తీయకు పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది.
Also Read:Revanth Reddy- KTR: టార్గెట్ కేటీఆర్.. రాహుల్ తో రేవంత్.. సిరిసిల్లలో మోహరింపు
[…] […]