Sreeleela: సినిమా ఏదైనా సరే.. హీరో ఎవరైనా సరే.. ఆ సినిమా మాస్ జనాల్లోకి వెళ్ళాలి అంటే.. ఐటెం సాంగ్ కచ్చితంగా ఉండాలి. క్లాస్ జనం ఐటెం సాంగ్స్ ను స్పెషల్ సాంగ్స్ అంటూ క్లాస్ గా పిలుచుకున్నా.. మాస్ సినిమాలకు మసాలా సాంగ్స్ ఉంటేనే అందం. స్టార్ హీరోల సినిమాలకు మరింత బూస్ట్ కావాలంటే ఐటమ్ సాంగ్ తప్పనిసరి. అందుకే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేత భారీ ఐటమ్ సాంగ్ చేయించారు.
అయితే ఇంతకు ముందు అలాంటి ఐటెమ్ సాంగ్స్ కోసమే సిల్క్ స్మిత, జయమాలిని, ముమైత్ ఖాన్ లాంటి స్పెషల్ గా కొంతమంది అందాల భామలు ఉండేవాళ్ళు. ఈ అందాల భామలు మరీ హీరోయిన్స్ అంత అందంగా ఉండాల్సిన పని లేదు. మంచి డ్యాన్స్ వచ్చి ఉండాలి. మంచి ఫిజిక్ ఉండాలి. కానీ, రాను రాను మన సినిమా డైరెక్టర్స్ ఆ ట్రెండ్‌కి మంగళం పాడేశారు.
Also Read: Charmy Kaur: ‘హీరోయిన్ల’ వ్యాపారం ప్లాన్ చేస్తున్న మాజీ హీరోయిన్
ఐటెం సాంగ్‌లో కూడా అందగత్తెలే ఉండాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్నా లాంటి టాప్ రేంజ్ హీరోయిన్స్‌తో ఐటెం సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో క్రేజీ బ్యూటీ శ్రీ లీల కూడా రెడీ అయింది. ఐటెం సాంగ్స్‌కి సై అనేసింది. శ్రీలీల అందాల పవర్ ఏంటో మన తెలుగు సినిమా డైరెక్టర్స్‌కి చాలా బాగా తెలుసు.
యువ ప్రేక్షకుల హార్ట్స్‌ని మొదటి సినిమాతోనే షేక్ చేసిన శ్రీలీల ఇప్పుడిక ఐటెం సాంగ్స్ తో ఏ రేంజ్‌లో దుమ్మురేపుతుందో చూడాలి మరి. శ్రీ లీల స్కిన్ షోకి చాలా మంది స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక స్పెషల్ సాంగ్స్‌లో శ్రీలీల అందాల ప్రదర్శన చూసి అలాంటి వాళ్ళ మతులు పోవడం ఖాయం. ఇప్పటికే శ్రీ లీల లిస్ట్ లో హీరోయిన్ గా కూడా చాలా సినిమాలు ఉన్నాయి.
అయినా అమ్మడు ఐటమ్ సాంగ్ లకు కూడా సై అంటుంది. కాకపోతే.. ఐటమ్ సాంగ్స్ ఓన్లీ స్టార్ హీరోల సినిమాల్లోనే చేస్తోంది అట. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో శ్రీ లీల ఓ ఐటమ్ సాంగ్ ఒప్పుకుంది. మొత్తానికి ఈ నిర్ణయంతో శ్రీలీల కూడా ఐటెం సాంగ్స్‌కి తాను రెడీ అని సిగ్నల్ ఇచ్చింది.