దిగజారుతున్న టీడీపీ పరిస్థితి.. పొత్తు కోసం బాబు ఎదురుచూపు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలం క్రమంగా తగ్గుతోంది. అధినేత తీరుతో కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పడుతున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోడంతో అసహనానికి గురవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా పవర్ లో లేనప్పుడు మరోలా వ్యవహరించడం బాబుకు అలవాటే. మహానాడులో కార్యకర్తలను, ప్రజలను సంతృప్తిపరచలేకపోయారు. ఏ నిర్ణయంలోనే ఏకాభిప్రాయం లేక అందరు ఆశ్చర్యపోయారు. అయినా ఆయన ఎవరిని పట్టించుకోవడం లేదు. లోకేష్ కు ప్రాధాన్యత పెంచి ఆయన స్థానాన్ని సుస్థిరం చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో […]

Written By: Srinivas, Updated On : May 31, 2021 2:34 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బలం క్రమంగా తగ్గుతోంది. అధినేత తీరుతో కార్యకర్తలు, నాయకులు ఆందోళనలో పడుతున్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోడంతో అసహనానికి గురవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా పవర్ లో లేనప్పుడు మరోలా వ్యవహరించడం బాబుకు అలవాటే. మహానాడులో కార్యకర్తలను, ప్రజలను సంతృప్తిపరచలేకపోయారు. ఏ నిర్ణయంలోనే ఏకాభిప్రాయం లేక అందరు ఆశ్చర్యపోయారు. అయినా ఆయన ఎవరిని పట్టించుకోవడం లేదు. లోకేష్ కు ప్రాధాన్యత పెంచి ఆయన స్థానాన్ని సుస్థిరం చేయడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంపై ఎక్కువగానే మాట్లాడుతున్నారు. రాష్ర్ట భవిష్యత్తును పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దేశంలో మోదీకి వ్యతిరేకంగా గాలి వీస్తోందని, ఆయన ఓటమి ఖాయమని చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబుకు కనిపించే ఒకే ఒక్క పార్టీ జనసేన. వారు కూడా బీజేపీతోనే పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బాబు ఎటు వైపు మొగ్గుతారో వేచి చూడాల్సిందే.

బీజేపీ బలాన్ని బాబు తక్కువగా అంచనా వేయలేకపోయారు. దీనిపై ఏపీ బీజేపీ నేతలు సానుకూలంగా స్పందించలేదు. కానీ చంద్రబాబుకు అర్థం కాలేదన్నదే ప్రశ్న. మోడీ చరిష్మా వెలిగిపోతున్న నేపథ్యంలో బాబు బీజేపీతో దోస్తీ కట్టాలని భావించినా అది నెరవేరేలా లేదు. టీడీపీ భవితవ్యం ఏమిటన్నది అర్థం కావడం లేదు.

బీజేపీ బలం యూపీలో తగ్గుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫలితాలు రుజువు చేశాయి. ఇలాంటి సమయంలో బీజేపీతో అంటకాగేందుకు బాబు పథకం వేస్తున్నా ఆచరణలో సఫలం కావడం లేదు. టీడీపీ ప్రస్తుతం ఒంటరి పార్టీగానే మిగిలిపోతోంది. సీపీఐతో కూడా పొత్తు ఉండదనే విషయం స్పష్టం అయింది.