https://oktelugu.com/

TDP: ఈసారి గట్టి పోటీ తప్పదంటున్న టీడీపీ?

TDP : వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎన్నికల్లోనూ ఆపార్టీ హవానే కొనసాగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనమే నడిచింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కుప్పం’లోనూ వైసీపీ జెండానే ఎగురిందంటే టీడీపీ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకొని వైసీపీకి సవాల్ విసురుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 5, 2022 / 12:09 PM IST
    Follow us on

    TDP : వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఎన్నికల్లోనూ ఆపార్టీ హవానే కొనసాగుతోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనమే నడిచింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కుప్పం’లోనూ వైసీపీ జెండానే ఎగురిందంటే టీడీపీ పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

    Chandrababu Naidu

    టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకొని వైసీపీకి సవాల్ విసురుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు. చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించి ప్రచారం చేసినా పెద్దగా వర్కౌట్ కాకపోవడం గమనార్హం. అయితే కుప్పం పరాజయం నుంచి గుణపాఠం నేర్చుకున్న చంద్రబాబు ఈసారి వైసీపీకి గట్టి పోటీ ఇస్తామంటూ బల్లగుద్ది వాదిస్తున్నారు.

    త్వరలోనే 22 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాలపరిమితి, కోర్టు కేసులు కారణంగా ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. త్వరలోనే ఈ మున్సిపాలిటీలకు సైతం ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు.

    ఈ విషయంపై చంద్రబాబు నాయుడు 22 మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ప్రత్యర్ధులకు లొంగిపోని నేతలనే బరిలోకి దింపాలని, సొంత పార్టీని దెబ్బతీసేలా వ్యవహరించే నేతలను దూరం పెట్టాలని నేతలకు సూచించారని తెలుస్తోంది.

    పార్టీ కోసం గతంలో కష్టపడి పనిచేసే వారిని కొందరు నేతలు కావాలనే దూరంపెట్టారని మండిపడ్డారు. ప్రస్తుతం అలాంటివేమీ జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నియోజకవర్గ నేతలకు సూచించారు. అయితే టీడీపీకి నియోజకవర్గాల్లో సరైన ఇన్ ఛార్జులు లేరని తెలుస్తోంది. కొద్దిరోజులుగా టీడీపీ కార్యక్రమాలకు నేతలు దూరంగా ఉంటున్నారు.

    దీంతోపాటు ఇప్పటి నుంచే ఎన్నికల కోసం ఖర్చు చేస్తే రేపు టికెట్ దక్కుతుందో లేదోనని ఆందోళన వారిలో కన్పిస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడి మాటలను ఆపార్టీ నేతలు ఎంత వరకు వింటారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈసారైనా టీడీపీ వైసీపీకి పోటీ ఇస్తుందా? లేదంటే యథావిధిగా చతికిలపడుతుందా? అనేది ఆసక్తిని రేపుతోంది.