విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధితులకు అండగా ఉన్న టిడిపి, తదితర ప్రతిపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. హైదరాబాద్ నుంచి టీడీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటి వద్దు, కూతురే కావాలనే తల్లిపై కేసులు పెట్టడం కన్నా అమానుషం మరొకటి లేదని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి, చితికి పోయిన పేదలపై భారాలు మోపడాన్ని గర్హించారు.
కరోనా నుంచి ప్రజలను ఆదుకునే చర్యలు వదిలేసి, కరెంటు ఛార్జీలు రెట్టింపు వసూళ్లు చేయడాన్ని ఖండించారు. అటు ఆర్ధికంగా, ఇటు ఆరోగ్యపరంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమస్యలను పరిష్కారం చేయడం చేతగాక కొత్త సమస్యలు సృష్టించడమే పనిగా వైసిపి నాయకులు పెట్టుకున్నారు. ఏదో ఒకటి మాట్లాడటం, ఎదురుదాడి చేయడం, తప్పించుకుపోవడం వైసిపి నాయకులకు పరిపాటి అయ్యిందని దుయ్యబట్టారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని, బాధిత ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.టిడిపి నాయకులపై, ప్రతిపక్షాలపై, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
లీకేజికి కారణమైన కంపెనీని కాపాడాలని చూస్తారు, మొక్కుబడి సెక్షన్లతో నామ్ కె వాస్తే కేసు పెడతారు. బాధితులపైనే ఎదురు కేసులు పెడతారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి దుర్ఘటనను సాధారణ ప్రమాదంగా చూపించి కంపెనీ కొమ్ము కాయడం దారుణమన్నారు. విమానాశ్రయంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడటం, రూ. కోటి పరిహారం ప్రకటించడం, మల్టీ నేషనల్ కంపెనీగా కితాబు ఇవ్వడం, అందులోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడం, అంతా వెనకేసుకొచ్చే ధోరణిలో భాగమేనని స్పష్టం చేశారు. నిందితులకు సానుకూలంగా ముఖ్యమంత్రి మాట్లాడటం విచారణను నీరుగార్చడమేనాని కంపెనీని మూసేయాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తుంటే అందులో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎలా అంటారని ప్రశ్నించారు.
ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యఅని, భావితరాల భవిష్యత్ కు సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.
ఈ కంపెనీకి భూములు టిడిపి ప్రభుత్వమే ఇచ్చిందనడం పచ్చి అబద్దంమని, హిందుస్తాన్ పాలిమర్స్ కు 1964 నవంబర్ 23న అప్పటి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213ఎకరాల భూమిని ఎకరం రూ. 2,500 రేటు మీద అందజేసిందన్నారు. ఈ భూమికి 1992 అక్టోబర్ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చిందని చెప్పారు. ఇతర పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Tdp slams ysrc on vizag gas leak
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com