TDP- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మారుతున్నాయి. పొత్తులపై ఎవరి ఎత్తులు వారికున్నాయి. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తామని ప్రకటించిన నేపథ్యంలో అందరిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనిపై టీడీపీ మాత్రం మౌనం వహిస్తోంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు మదిలో ఏం ఆలోచనలు ఉన్నాయో తెలియడం లేదు. కానీ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం టీడీపీ మౌనముద్ర వహిస్తోంది. పొత్తులై ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
పవన్ కల్యాణ్ మాటల్లో అంతరార్థం గ్రహించే ఏం మాట్లాడటం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పెద్దన్న పాత్ర పోషించేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన మాటల్లో తెలిసిపోతోంది. అందుకే టీడీపీ నేతలు మౌనంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ప్రస్తుతం రాబోయే ఎన్నికలపై ఓ విజన్ తో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీని ఎదర్కోవాలంటే దానికి తగిన కసరత్తు ఉండాలని భావిస్తున్నారు. టీడీపీతో ఆ తతంగం జరగదని తెలిసినా పొత్తుల విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: BJP Parthasarathi: ‘రాయలసీమ రణభేరి’ మోగించిన బీజేపీ
మరోవైపు పవన్ కల్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం వెళతామని చెప్పడంతో ఆయన బీజేపీతోనే ఉన్నారనే సంకేతాలు స్పష్టంగా ఉండటంతో ఏం మాట్లాడటం లేదు. టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలియడంతో పవన్ కల్యాణ్ బీజేపీతోనే కలిసి పోరాడతారనే భావంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని చెప్పినా దానికి టీడీపీ నేతలు ఎక్కడా స్పందించడం లేదు. అంటే పవన్ కల్యాణ్ ను బీజేపీ మిత్రపక్షంగానే చూస్తున్నారని తెలుస్తోంది. ఆయన మాటల్లో కూడా అది తెలిసిపోయింది.
ఈ నేపథ్యంలో పొత్తులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై స్పష్టత లేదు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలు ఒకటి కావాలనే ఉద్దేశం ఉన్నా వాటిలో ఇంకా ఎలాంటి సంకేతాలు రావడం లేదు ఫలితంగా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సొంత ఎజెండాతో ముందుకెళితే మళ్లీ ప్రమాదంలో పడతారనే వాదనలు కూడా వస్తున్నాయి. అందరు కలిసి పోరాడితేనే వైసీపీని ఢీకొనడం సులువు అవుతుంది. లేదంటే ఎవరి దారిలో వారు సొంత జెండాతో పోరాటం చేస్తే వైసీపీకే లాభం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే అన్ని పార్టీలు కలిసి పోరాడి వైసీపీని మట్టికరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుసుకోవాలి.
Also Read: Pawan Kalyan vs YCP: పవన్ ‘ప్రకటన’ను తప్పు దారి పట్టిస్తున్న వైసీపీ