నైరాశ్యంలో ‘తెలుగు’ యువత..!

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు. కొన్ని దశాబ్దాలపాటు ఓ వెలుగువెలిగిన టీడీపీలో ప్రస్తుతం నైరాశ్యం నెలకొంది. తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాగా ఏపీలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఏపీలో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ కిందటి ఎన్నికల్లో ఓటమిపాలైంది. సీఎం జగన్ ధాటిని తట్టుకోలేక టీడీపీ నేతలంతా సైలంటవుతున్నారు. జగన్ సర్కార్ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ కొన్ని విషయాల్లో పోరాటం చేస్తున్నా పెద్దగా మైలజ్ రావడం లేదు. మూడు […]

Written By: NARESH, Updated On : June 30, 2021 11:28 am
Follow us on

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని అన్న ఎన్టీఆర్ స్థాపించారు. కొన్ని దశాబ్దాలపాటు ఓ వెలుగువెలిగిన టీడీపీలో ప్రస్తుతం నైరాశ్యం నెలకొంది. తెలంగాణలో టీడీపీ కనుమరుగు కాగా ఏపీలో మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. ఏపీలో గత ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ కిందటి ఎన్నికల్లో ఓటమిపాలైంది. సీఎం జగన్ ధాటిని తట్టుకోలేక టీడీపీ నేతలంతా సైలంటవుతున్నారు.

జగన్ సర్కార్ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీ కొన్ని విషయాల్లో పోరాటం చేస్తున్నా పెద్దగా మైలజ్ రావడం లేదు. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించినా.. అన్న క్యాంటీన్ల రద్దుపై గళం విప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో టీడీపీ నేతలు కరోనా సాకు చూపుతూ ఇంటికే పరిమితం అవుతున్నారు. కేవలం సోషల్ మీడియాకే ఒకటి రెండు ట్వీట్లు పెట్టి మమా అనిపిస్తున్నారు.

టీడీపీ ప్రతిపక్షంలో ఉండి రెండేళ్లుగా గడుస్తున్నా పార్టీ మాత్రం పుంజుకోవడం లేదనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి వ్యూహాలు మునపటిలా పారడంలేదనే పార్టీ నేతలే అంటున్నారు. దీనికితోడు చంద్రబాబు గంటలగంటలు జూమ్ మీటింగ్ పెడుతున్నారు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పా పార్టీని గాడిని పెట్టే ప్రయత్నం చేయలేదనే నైరాశ్యం నేతల్లో నెలకొంది.

చంద్రబాబు నాయుడు కేవలం సీనియర్ల మాటలను మాత్రం పరిగణలోకి తీసుకుంటున్నారని యువనేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు తమ సలహాలను పట్టించుకోకపోవడంపై తెలుగు యువత నిరుత్సాహం చెందుతున్నారు. తాజాగా టీడీపీ ప్రకటించిన పార్లమెంటరీ కమిటీల్లోనూ సీనియర్లకు పెద్దపీఠ వేసి యువతను పట్టించుకోకపోవడం అగ్నికి అజ్యం పోసినట్లయింది. దీంతో చంద్రబాబుకు యువ నేతల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది.

గత రెండేళ్లలో తాము ఇచ్చిన సలహాలను చంద్రబాబు ఆచరణలో పెట్టి ఉంటే టీడీపీ గాడిలో పడేదని యువ నేతలు అంటున్నారు. కానీ అధినేత మాత్రం సీనియర్లకు ఇచ్చిన విలువ పదోవంతు కూడా తమకు ఇవ్వడం లేదని యువ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో కేవలం సీనియర్లకే ప్రాధాన్యం లభిస్తుండటంతో యువ నేతలు పార్టీని వీడే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ పరిస్థితి టీడీపీ రాబోయే రోజుల్లో మరింత నష్టం తెచ్చేలా కన్పిస్తుంది. పలువురు టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లినా చంద్రబాబు నష్ట నివారణపై చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీలో సీనియర్లు వర్సెస్ తెలుగు యువత అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పార్టీలో నెలకొన్న ఈ నైరాశ్యాన్ని టీడీపీ అధినేత ఎలా పరిష్కరిస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.