Kodali Nani : టీవీ9, వైసీపీ అవినా”బావ” సంబంధం.. పచ్చ తమ్ముళ్లు ఇంతకు దిగజారాలా?

ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : January 14, 2024 8:46 pm
Follow us on

Kodali Nani -TV9 Reporter : ఆమె పేరు హసీనా.. టీవీ9 ఛానల్ లో పనిచేస్తూ ఉంటుంది. ఏపీలో సీఎం బీట్ చూస్తుంది. గతంలో ఈమెకు, ఎన్టివిలో పనిచేసే రిపోర్టర్ కు గొడవ జరిగిందని.. అది చినికి చినికి గాలి వాన లాగా మారిందని.. తర్వాత ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని అంటూ ఉంటారు. సరే ఆ సంగతిని పక్కన పెడితే ఆ టీవీ9 హసీనా తన విధుల్లో భాగంగా గుడివాడలో జరిగే సంక్రాంతి సంబరాలను కవర్ చేసింది. దానికి ముఖ్యఅతిథిగా ఆ ప్రాంత ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. ఆ వేడుకల వద్దకు కొడాలి నాని తన బైక్ మీద హసీనాను ఎక్కించుకొని వచ్చారు. అక్కడ జరుగుతున్న సంక్రాంతి వేడుకలను కవర్ చేయడం తన బాధ్యత. పైగా తన మేనేజ్మెంట్ చెప్పినట్టు చేయాలి కాబట్టి.. ఆమె ఆ ఎమ్మెల్యే బైక్ మీద వెళ్ళింది.( ఆ మధ్య తెలంగాణ ఎన్నికల్లో ఆ టీవీ9 కే చెందిన ప్రత్యూష అనే యాంకర్ కూడా ఇలానే బుల్లెట్ బండి పై ఇంటర్వ్యూలు చేసింది) సాధారణంగా ఒక రిపోర్టర్, ఒక రాజకీయ నాయకుడి బైక్ మీద ఎక్కడం పెద్ద తప్పు కాదు. ఆ లెక్కన చూసుకుంటే రాజకీయ పార్టీల నాయకులు న్యూస్ చానల్స్ యాజమాన్యాల ఇళ్లకు వెళ్లడం లేదా? అక్కడ టికెట్ల కేటాయింపుకు సంబంధించి చర్చలు జరగడం లేదా? వాటితో పోలిస్తే హసీనా, కొడాలి నాని బైక్ ఎక్కడం పెద్ద విషయం కాదు కదా..
కానీ హసీనా కొడాలి నాని బండి ఎక్కడం టిడిపి నాయకులకు పెద్ద ద్రోహం లాగా కనిపించింది. అదేదో జరగకూడని తప్పు జరిగిపోయిందని వారికి అనిపించింది. ఇంకేముంది సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆ వీడియోను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు. పైగా దానికి టీవీ9, వైసీపీ నాయకుల అవినా”బావ” సంబంధం అంటూ ఏవేవో బంధాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు వైసీపీకి టీవీ9 అనుకూలంగా పనిచేస్తుందని.. అందుకే అక్కడ జరిగే సంక్రాంతి సంబరాలను ప్రముఖంగా ఇస్తుందని ఆరోపించడం మొదలుపెట్టారు. కొడాలి నాని వైసీపీ నాయకుడు కాబట్టి అతడి మీద టిడిపి నాయకులు ఆరోపణలు చేసుకోవచ్చు. కొడాలి నాని కూడా అదే స్థాయిలో టిడిపి నాయకులను విమర్శిస్తూ ఉంటారు. కానీ పండగ సందర్భంగా జరిగే వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లే ఛానల్ ఉద్యోగిపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆమెకు ఒక కుటుంబం ఉంటుంది, ఆమెకు వ్యక్తిగత జీవితం ఉంటుంది.. ఇలాంటి ఆరోపణలు చేస్తే రేపటినాడు ఆమె పరిస్థితి ఏమిటి? ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లి పరిస్థితులను కవర్ చేసిన డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టు ఆమె. అలాంటి మహిళ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.
టిడిపి నాయకులు కొడాలి నాని, హసీనా మధ్య సంబంధం అంటగడుతున్నారు గాని.. మరి వారి పార్టీకి ఒక సెక్షన్ మీడియా ఎప్పటికీ వంత పాడుతూనే ఉంటుంది. ఆ పార్టీ అధినేత ఇంటికి పలువురు మీడియా ప్రతినిధులు వెళ్తూనే ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూనే ఉంటారు. అది టీడీపీ నాయకులకు తప్పుగా అనిపించదా? మరి అది ఒప్పు అయినప్పుడు నాని, హసీనా విషయం కూడా తప్పు ఎలా అవుతుంది? క్షేత్రస్థాయిలో నాని ఏమైనా తప్పులు చేస్తే ఎండ కట్టాలి. ఆయన ఏదైనా అవినీతికి పాల్పడితే ఆధారాలతో సహా విమర్శించాలి. అంతేగాని ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న ఉద్యోగిని బయటకు లాగడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి వాటికి టిడిపి అధినాయకత్వం మాత్రం ఎలా సపోర్ట్ ఇస్తుంది? గతంలో భువనేశ్వరిని ఏదో అన్నారని వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు.. హసీనా విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు.. ఇలాంటి థర్డ్ గ్రేడ్ పోస్టులు పెట్టే కార్యకర్తలను అదుపు చేయలేరా? ఇలాంటి చర్యలను ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.