Jagan vs TDP Media: అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రోజులవీ..మొదటి నాలుగేళ్లు సైలెంట్ గా ఉన్న టీడీపీ మీడియా 2009 అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క ఏడాది ముందు జూలు విదిల్చాయి. ఈనాడు అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ‘పెద్దలా గద్దలా’ అంటూ ఓబులాపురం మైనింగ్ సహా జలయజ్ఞం, పథకాల్లో ఎన్నో అవినీతి వ్యవహారాలను తవ్వితీసింది. కార్టూన్లతో వైఎస్ఆర్ ను విలన్ గా చూపి నానా రచ్చ చేశారు. టీడీపీకి అనుకూలంగా ఉండే ఆ రెండు పత్రికలకు తోడు, ఎలక్ట్రానిక్ న్యూస్ చానెల్స్ అన్నీ వైఎస్ఆర్ ను ఓడించడమే ధ్యేయంగా పనిచేశాయి. కానీ ప్చ్.. బ్యాడ్ లక్.. సంక్షేమాన్ని పంచిన వైఎస్ఆర్ నే ప్రజలు రెండోసారి గెలిపించారు.
ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణ , ఏపీ ఏర్పడ్డాయి. గద్దెనెక్కిన కేసీఆర్ పై కూడా అలానే విరుచుకుపడింది టీడీపీ అనుకూల మీడియా.. చంద్రబాబు గొప్ప పరిపాలన అందిస్తున్నాడని.. తెలంగాణలో కేసీఆర్ కు చేత కావడం లేదని హోరెత్తించాయి. కానీ కేసీఆర్ రెండు టాప్ న్యూస్ చానెల్స్ ను రాష్ట్రంలో నిషేధించి మీడియాకు హెచ్చరికలు పంపాడు. ఆ తర్వాత మొత్తం మీడియాపై ఫోకస్ చేసి గుప్పిట పట్టి అందరి నోళ్లు మూయించాడు. ఓటుకు నోటులో చంద్రబాబును పట్టించి అమరావతికి సాగనంపడంతో టీడీపీ మీడియా కుక్కిన పేనులా పడి ఉంది.
జర్నలిజం విలువలు అంటూ ఊదరగొట్టే ఆ రెండు పత్రికలు కూడా టీడీపీకి ఎందుకు వ్యతిరేకంగా వార్తలు రాయరన్నది సగటు పౌరులకు కూడా అర్థం కావడంతో వాటి విశ్వసనీయత పడిపోయింది. సోషల్ మీడియా రంగ ప్రవేశంతో అసలు వాస్తవాలు ప్రజలకు నేరుగా వేగంగా అందాయి. దీంతో మీడియా విశ్వసనీయత పడిపోయింది. ఇప్పుడైతే కరోనా తర్వాత అసలు వార్తలను ప్రచురించడంలో పత్రికలు దిగజారిపోయాయి.
ఇటీవల ఏపీలో అభివృద్ధి ఆగిపోతోందని.. ఔటర్ రింగ్ రోడ్డుకు ఉరి శీర్షికతో టీడీపీ అనుకూల టాప్ పత్రిక ఓ కథనాన్ని వండివార్చింది. విజయవాడ-గుంటూరు చుట్టుపక్కల 189 కి.మీ ప్రతిపాదిత రింగురోడ్డు స్థానంలో ప్రభుత్వం 78 కి.మీ బైపాస్ రోడ్డుకే పరిమితమైందని ఆడిపోసుకుంది. అయితే వార్త ఇది అయితే హెడ్డింగ్ మాత్రం జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా పెట్టడం విమర్శలపాలైంది.
189 కి.మీల ఔటర్ రింగ్ రోడ్డు భూమి సేకరణకు ఎంత ఖర్చు అవుతుంది? కేంద్ర ప్రభుత్వం తన నిధులతో రోడ్డు నిర్మించగలదా? లేక ఏపీ ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించాలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పకుండా జగన్ సర్కార్ ను అభాసుపాలు చేసేలా కథనాన్ని ప్రచురించారు. ఇకదీన్ని హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుతో పోల్చడం మరో తప్పు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉపయోగించే భూమిలో ఎక్కువభాగం సారవంతమైనది కాదు..కానీ విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని భూమి ఎంతో సారవంతమైనది విలువైనది..
వైఎస్ఆర్ హయాంలో కూడా హైదరాబాద్ ఔటర్ రింగ్ కోసం భూసేకరణ సందర్భంగా ఇదే దినపత్రిక ప్రభుత్వం నిరంకుశత్వంతో భూములను లాక్కుంటోందని రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు విజయవాడ-గుంటూరు ప్రాంతంలో 189 కి.మీ ఓఆర్ఆర్ ను ఆపలేమని చెబుతున్నారు.
Also Read: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజుకు మెగా, సూపర్ స్టార్స్ స్పెషల్ విషెష్
నిజానికి అమరావతి అభివృద్ధి జరగడం లేదని ఇదే టీడీపీ అనుకూల మీడియా దుమ్మెత్తిపోస్తోంది.ఇప్పుడు జగన్ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు కడుతుంటే అవినీతి వ్యవహారం అంటూ ఎత్తిచూపుతోంది. ఇదే చంద్రబాబు హయాంలో ఎన్నో పథకాలు, ఇలాంటి ప్రాజెక్టులు ప్రకటించారు. వాటిలో ఎన్ని నెరవేరాయి? ఎన్నింట్లో అవినీతి జరిగిందన్న వాటిపై ఈ పత్రికలు ఒక్క కథనాన్ని వేసింది లేదు. పైగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి వెర్షన్ తీసుకోకుండానే దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.
వాస్తవాలను దాచిపెట్టి.. వన్ సైడ్ గా టీడీపీ ప్రయోజనాల కోసం అనుకూలంగా ప్రదర్శిస్తున్న ఈ దినపత్రిక ఇలాంటి కథనాలు ఎన్నో వండివర్చింది. ఇక జగన్ కు రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై పడి వాటిల్లోని లూప్ హోల్స్ ను ఎత్తి చూపి ఎండగట్టేందుకు ఆ రెండు పత్రికలు రెడీ అవుతున్నాయట.. సో జగన్ సర్కార్ పై టీడీపీ మీడియా దాడి ప్రారంభమైందన్నమాటే..
Also Read: ఇంకా రెండేళ్లే మిగిలింది.. ప్రజలను మెప్పించేందుకు జగన్ ఏం చేయనున్నారు?