https://oktelugu.com/

Hero Nani: నానితో కలిసి నటించాలనుందా.. అయితే ఈ అవకాశం మీకోసమే!

Hero Nani: టాలీవుడ్ హీరో నేచురల్​ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్​ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్​ సినిమాలో నటించిన ఈ హీరో.. డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా, దీంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సుందరానికి అనే సినిమా సెట్స్​పై ఉండగానే.. దసరా చిత్రానికి కూడా పనులు మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా  నటుస్తోంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 10:47 AM IST
    Follow us on

    Hero Nani: టాలీవుడ్ హీరో నేచురల్​ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్​ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్​ సినిమాలో నటించిన ఈ హీరో.. డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా, దీంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సుందరానికి అనే సినిమా సెట్స్​పై ఉండగానే.. దసరా చిత్రానికి కూడా పనులు మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా  నటుస్తోంది. నిత్యా మేనన్​ కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ,దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇందులో నాని పక్కా తెలంగాణ పోరగాడిగా కనిపించనున్నాడు.

    Hero Nani

    Also Read:  ‘సింహంలా ఉన్నావ్​ నాన్న’ అంటూ నానికి కొడుకు బిరుదు.. నెట్టింట్లో వీడియో వైరల్​

    కాగా, తాజాగా, ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి కాస్టింగ్ కాల్​కు ఆహ్వానం పలికారు మేకర్స్. తెలుగులో మాట్లాడే నటీనటుల ఎవ్వరైనా ఇందులో పాల్గొనచ్చని ప్రకటన ఇచ్చారు. 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు, 8 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఈ క్రమంలోనే టాలెంట్ ఉన్నవారు ఏదైనా నటించిన వీడియోను.. dasaracasting@gmail.comకు మెయిల్​కు పంపించాలని తెలిపారు. అయితే, టిక్​టాక్​, ఇన్​స్టా రీల్స్ పరిగణలోకి తీసుకోమంటూ చెప్పారు.  ఈ నెల 31వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

    కాగా,మరోవైపు శ్యామ్ ​సింగరాయ్ సినిమాతో సరికొత్త పాత్రలో దర్శనమివ్వనున్నారు నాని. క్రిస్మస్​ కానుకగా ఈ సినిమా రానుంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాల్సి ఉంది.

    Also Read:  అదే జరిగితే ‘నాని’ స్థాయి సగం పడిపోయినట్టే !