
TDP: తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆశలు సన్నగిల్లుతున్నాయి. అధికారం మాట దేవుడెరుగు కానీ పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతోంది. చంద్రబాబులో సహనం కనిపించడం లేదు. సంయమనం కానరావడం లేదు. ఫలితంగా ఓటమి ప్రధాన కారణమవుతోంది. ఇప్పటికే వైసీపీ టీడీపీని టార్గెట్ చేసుకుంది. దీంతో చాలాచోట్ల విజయం సాధ్యమయ్యేట్లు లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ పరిస్థితి మునిగిపోయే నావలా మారిందని పార్టీ నేతలే చెబుతున్నారు.
చంద్రబాబు నాయకత్వంపై అనుమానాలు వస్తున్నాయి. ఆయన సమర్థతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. వయోభారంతో ఆయన వ్యూహాలు పనిచేయడం లేదు. ఫలితంగా పార్టీ భవిష్యత్ అంధకారంలో పడుతోంది. రాష్ర్టంలో అధికారం రావడం కష్టంగానే కనిపిస్తోంది. దీంతో నేతల్లో అయోమయం నెలకొంటోంది. ఈసారి టికెట్ రాకపోయినా ఫరవాలేదు. కానీ టికెట్ కావాలని కోరితే మాత్రం ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని చాలా మంది నేతలు ముఖం చాటేస్తున్నారు.
మరోవైపు వైసీపీ బలం పెరుగుతున్నందున టీడీపీ(TDP)కి నష్టమే జరుగుతుందనే భావన కార్యకర్తల్లో పట్టుకుంది. దీంతో టికెట్ అడగటానికి కూడా సిద్ధపడటం లేదు. గత ఎన్నికల్లో చేసిన అప్పులే ఇంతవరకు తీరలేదనే అభిప్రాయం నెలకొంది. ఈ క్రమంలో నారా లోకేష్ నాయకత్వంలో కూడా పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు.
దీంతో పార్టీ భవిష్యత్ ఏమిటన్నది అందరిలో నెలకొనే ప్రశ్న. దీనికి సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో నాయకులు బలంగా ఉన్నా ఖర్చుకు మాత్రం భయపడుతున్నారు. పార్టీ ఖర్చు పెడితేనే బయట పడగలుగుతామని భావిస్తున్నారు. కానీ పార్టీ పరిస్థితి కూడా అధ్వానంగా మారడంతో ఇక ఏం చేసేదని ఆలోచనలో పడిపోతున్నారు. లోకేష్ ను నమ్ముకున్నా పార్టీ గాడిలో పడుతుందనే ఆశ మాత్రం రావడం లేదు.
Also Read: చంద్రబాబు ‘ప్లాన్ బి’ అమలయ్యేనా..?