Homeఆంధ్రప్రదేశ్‌TDP First: 60 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. ఎవరెవరికి సీట్లు అంటే

TDP First: 60 మందితో టీడీపీ ఫస్ట్ లిస్ట్.. ఎవరెవరికి సీట్లు అంటే

TDP First: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. అన్ని రాజకీయ పక్షాలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు 38 మందిని మార్చారు. ఈ సంఖ్య 80 వరకు పెరుగుతుందని ఒక అంచనా ఉంది. మరోవైపు టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బిజెపి సైతం కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు లేని 60 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తోంది. సంక్రాంతి నాటికి తొలి జాబితా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

* ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ , పలాస నుంచి గౌతు శిరీష, టెక్కలి నుంచి కింజరాపు అచ్చెనాయుడు, ఆమదాలవలస నుంచి కూన రవికుమార్, రాజాం నుంచి కోండ్రు మురళీమోహన్ లకు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
*ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి చీపురుపల్లి కిమిడి నాగార్జున, బొబ్బిలి బేబీ నాయన, కురుపాం జగదీశ్వరి, విజయనగరం అశోక్ గజపతిరాజు, పార్వతీపురం విజయ్ చంద్రలకు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
* ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి.. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ గణబాబు, నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత
* తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తునిలో యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకట్ రాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అమలాపురం అయితా బత్తుల ఆనందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు
* పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, దెందులూరు చింతమనేని ప్రభాకర్
* కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, పెనమలూరు బోడె ప్రసాద్
* గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల యరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనంద్ బాబు
* ప్రకాశం జిల్లా కు సంబంధించి పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామచర్ల జనార్ధన్, కొండేపి బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి
* నెల్లూరు జిల్లాకు సంబంధించి కొవ్వూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, నగిరి గాలి భాను ప్రకాష్, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి
* కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, మైదకూరు పుట్టా సుధాకర్, పులివెందుల బీటెక్ రవి
* కర్నూలు జిల్లాకు సంబంధించి బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమ్మిగనూరు బీవీ జయనాగేశ్వర్ రెడ్డి
* ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి రాప్తాడు పరిటాల సునీత, ఉరవకొండ పయ్యావుల కేశవ్, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కళ్యాణదుర్గం ఉమామహేశ్వర నాయుడు, హిందూపురం బాలకృష్ణ, కదిరి కందికుంట వెంకటప్రసాద్ పేర్లు తొలి జాబితాలో ఉంటాయని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version