Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్తు కోసం అధికార వైసీపీ మినహా ఏపీలోని ప్రధాన పార్టీలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అధికారం దక్కాలంటే పవన్‌తో పొత్తు అనివార్యం అని కొన్ని పార్టీలు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. అందులో ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఉన్నాయి.

ప్రస్తతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఇవే తమకు మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని ఆ నేతలు ధీమాగా ఉన్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఏపీలో అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది. ఈ విషయాన్నే రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా హైలెట్ చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి.
జనసేన అధినేత పార్టీ కార్యకలాపాల్లో ప్రస్తుతం చురుగ్గా లేరు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం, పార్టీని నడిపించేందుకు అవసరమయ్యే డబ్బును పొగేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో పవన్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే పవన్‌కు అధికారం తప్పనిసరి. గతేడాది లాగా ఈసారి కూడా పవన్ ఒంటరిగా పోటీ చేస్తే మళ్లీ దెబ్బతినక తప్పదు. అందుకే పవన్ కూడా పొత్తులకే సై అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీతో దోస్తానా చేస్తున్నారు జనసేనాని.. మరోవైపు తెలుగు దేశం అధినేత కూడా పవన్‌తో పొత్తు కోసం ఆరాట పడుతున్నట్టు కనిపిస్తోంది.
Also Read: Chandrababu: చంద్రబాబు బాధ పగోడికి రావద్దట?
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నందున.. టీడీపీని దగ్గరకు రానివ్వకూడదని కాషాయ పార్టీ పట్టుబడుతోందట.. కానీ బీజేపీతో పవన్‌కు పెద్దగా ఒరిగేమీ ఏమీ ఉండదనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అక్కడ వైసీపీ లేదా టీడీపీకి మాత్రమే అధికారం దక్కే అవకాశం ఉంటుంది. అందుకే పవన్‌తో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ తెగ ఆరాట పడుతోందట.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకుని వైసీపీకి బుద్ధి చెప్పాలని అటు బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఆతృతగా ఉన్నాయి. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో పవన్‌తో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుందో.. ఏ పార్టీ దూరంగా ఉంటుందో..
Also Read: MP Raghurama: రఘురామ రాజీనామా వెనుక ఇంత స్టోరీ ఉందా..?